రమణ గోగుల అప్పుల పాలవ్వడానికి కారణం ఏమిటి ?

రమణ గోగుల.తొలుత ఒక టెక్కీ మాత్రమే.

 Why Ramanagogula Left Industry ,ramana Gogula ,misty Rhythms,tollywood Industry-TeluguStop.com

కానీ ఆయనకు మ్యూజిక్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తో తొలుత మిస్టి రిథమ్స్ అనే బ్యాండ్ తో కలిసి పని చేసేవాడు.ఆ క్రమంలో ఇండీ పాప్ స్టూడియో వారికి ఆయే లైలా అనే ఒక మ్యూజిక్ ఆల్బం చేసి పెట్టారు.

అది బాగా హిట్ అవ్వడం తో అమెరికాలో సెటిల్ ఐయాం రామం ఇండియా బాట పట్టారు.అక్కడ మొదలు పెట్టిన ప్రయాణం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతడిని ఒక సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా, నిర్మాతగా, గాయకుడిగా మార్చేసింది.

తెలుగు వాడైనప్పటికీ ఖరగ్‌పూర్‌లో ఐఐటి లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా కి పై చదువుల కోసం వెళ్లి లూసియానా స్టేట్ యూనివర్శిటీ నుండి ఎం ఎస్ పూర్తి చేసి అక్కడే టెక్కీ గా ఉద్యోగం చేస్తూనే స్టార్ట్-అప్ కంపెనీ కూడా పెట్టాడు.ఆ తర్వాత 1995 లో ఇండియా కి తిరిగి వచ్చి మొదట వెంకటేష్ సినిమా అయినా ప్రేమంటే ఇదేరా కి సంగీతం అందించాడు.

ఆ సినిమా మ్యూజికల్ గా మంచి మార్కులు వేయించుకోవడం తో రమణ గోగుల వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చుకున్నాయి.వెంకటేష్ తో మరోమారు లక్ష్మి సినిమాకు సంగీతం అందించి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Telugu Abaddalu, Boni, Mahesh Babu, Mechanical Iit, Misty Rhythms, Musicchompose

ప్రభాస్ కి యోగి సినిమాకు కూడా సంగీత దర్శకత్వం చేపట్టిన రమణ గోగుల కొన్ని కన్నడ మరియు తమిళ సినిమాలకు కూడా పని చేసాడు.మహేష్ బాబు నటించిన యువరాజు కి కూడా సాంగ్స్ అన్ని రమణ కంపోజ్ చేయగా, సుమంత్ తో ఒక సినిమా కూడా నిర్మించాడు.ఆ చిత్రం పేరు బోణి.ఈ సినిమా ఫ్లాప్ కావడం తో రమణ గోగుల అప్పుల పాలయ్యాడు.ఇక తేజ చిత్రం 1000 అబద్దాలతో మల్లి పూర్వ వైభవం తెచ్చుకోవాలన్న ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం తో తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు.అక్కడ ప్రస్తుతం క్లీన్ టెక్నాలజీ ఇన్నవోషన్ ఎట్ స్టాన్లే బ్లాక్ డెక్కర్ కి మరియు వెంచర్ పార్ట్నర్ ఎట్ అంథిల్ వెంచర్ కి వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube