నెయ్యి.పాల నుండి వచ్చే ఉత్పత్తుల్లో ఇది ఒకటి.
నెయ్యి చక్కటి రుచి, సువాసన మాత్రమే కాదు విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ, ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అద్భుతమైన పోషకాలను సైతం కలిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య పరంగా నెయ్యి అనేక ప్రయోజనాలను అందిస్తుందని, రోజుకు ఒక స్పూన్ నెయ్యిని తీసుకుంటే వివిధ రకాల జబ్బులు దరి చేరకుండా ఉంటాయని నిపుణులు అంటుంటారు.
అయితే నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.కొందరు మాత్రం దానిని తీసుకోరాదు.
మరి ఆ కొందరి లిస్ట్‌లో మీరు ఉన్నారేమో ఓ చూపు చూసేయండి.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు నెయ్యిని ఎవైడ్ చేయాలి.
ఎందుకంటే, నెయ్యిని తీసుకోవడం వల్ల హార్ట్ పేషెంట్స్ లో కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగిపోతాయి.కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు ముప్పు మరింత పెరుగుతుంది.
అందుకే గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు నెయ్యి దూరం పెట్టాలి.ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.
అలాగే దగ్గుతో సతమతం అయ్యేవారు.అది తగ్గే వరకు నెయ్యిని తీసుకోవడం మానేయాలి.దగ్గు వేధిస్తున్నప్పుడు నెయ్యిని తీసుకుంటే.సమస్య మరింత ఎక్కువ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

లివర్ సిర్రోసిస్ వ్యాధి ఉన్న వారు కూడా నెయ్యి జోలికి వెళ్లకూడదు.లివర్ సిర్రోసిస్ అనేది లివర్ కు సంబంధించిన ప్రాణాంతక వ్యాధి.దీని బారిన పడ్డవారు పొరపాటున కూడా నెయ్యిని ముట్టకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలతో మదన పడుతున్న వారు నెయ్యికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అజీర్థి వంటి వాటిని తరచూ ఫేస్ వారు నెయ్యిని తీసుకుంటే.ఆయా సమస్యలు మరింత తీవ్రతరంగా మారతాయి.
ఇక ఊబకాయం బాధితులు సైతం నెయ్యిని ఎవైడ్ చేయడం లేదా పరిమితంగా తీసుకోవడం చేయాలి.
