రీల్స్ పిచ్చి.. రీల్స్ కోసం బైక్‌పై డేంజర్ స్టంట్స్.. దెబ్బకి?

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరికి వారు ఫేమస్ అవ్వడానికి ఎంతటి సాహసం చేయడానికైనా ముందు వరసలో ఉంటున్నారు.అంతేకాకుండా వారు ఫేమస్ అవ్వడానికి కోసం పక్కవారిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

 Reels Crazy Stunts For Bike Danger Stunts For Reelsman ,fall While Performing ,b-TeluguStop.com

కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రోడ్లపై, రైల్వే ట్రాక్స్ పై రకరకాల సాహసాలు చేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు.అయితే, ఇది ప్రమాదం అని తెలిసినా కూడా వారు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రిస్కులో పడేస్తున్నారన్న విషయం మర్చిపోతున్నారు.

ఇక కొంతమంది ఇలా రీల్స్ పిచ్చితో వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ప్రాణాలు సైతం పోగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇలా ఎన్ని సందర్భాలు జరిగినా కానీ కొంత మంది మాత్రం వారి తీరులో ఎటువంటి మార్పు లేదు.అచ్చం అలాంటి సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.

ముందుగా ఒక యువకుడు మోటార్ సైకిల్ డ్రైవ్ ( Motorcycle drive )చేస్తూ వస్తూ ఉంటాడు.ఈ క్రమంలో హఠాత్తుగా స్టంట్స్ చేయడానికి ప్రయత్నించగా అతడు బైక్ మీద నుంచి రోడ్డు మీదకు పడి గాయాల పాలు అయ్యాడు.

ఒక్కసారి యువకుడు బండి మీద నిల్చునే ప్రయత్నం చేస్తూ రెండు కాళ్ళను సీటుపై ఉంచి హ్యాండిల్ పట్టుకొని బైక్ ను బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నం చేశాడు.

కానీ., ఆ బ్యాలెన్స్ ను అదుపు చేయలేకపోవడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్.

ఇలాంటి స్టంట్స్ చేసేముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారా అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.మరి కొందరు.

, ఇలాంటివి చేయాలి అంటే ముందుగా ప్రాక్టీస్ ఉండాలని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube