పోషకాల కొరత, రసాయనాలతో కూడిన కేశ ఉత్పత్తులను వాడటం, కాలుష్యం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం తదితర కారణాల వల్ల హెయిర్ రూట్స్ అనేవి బలహీన పడుతూ ఉంటాయి.దాంతో జుట్టు రాలడం అనేది అధికమవుతుంది.
మీ హెయిర్ రూట్స్ కూడా చాలా వీక్ గా మారాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ఫాలో అయ్యారంటే సింపుల్ గా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక అరటి పండును( Banana fruit ) తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్ వేసుకోవాలి.అలాగే పావు కప్పు ఫ్రెష్ కలబంద జెల్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ), రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి( Munagaku powder ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందుతారు.ముఖ్యంగా ఈ మాస్క్ హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా మారుస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది.అలాగే అరటిపండు, పెరుగు, అలోవెరా, మునగాకు, ఆముదం.
ఇవన్నీ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.కురులను ఆరోగ్యంగా మారుస్తాయి.
జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.ఒత్తయిన పొడవాటి కురులను మీ సొంతం చేస్తాయి.
కాబట్టి జుట్టు కుదుళ్లు బలహీనంగా ఉన్నాయని బాధపడుతున్న వారు, కురులు హెవీగా రాలిపోతున్నాయని సతమతం అవుతున్నవారు తప్పకుండా పైన చెప్పిన సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.