మనకు అందుబాటులో ఉన్న ఎన్నో రకాల కూరగాయలలో క్యారెట్లు( Carrots ) కూడా ఒకటి.అయితే వీటిని చాలా మంది పచ్చిగానే తింటూ ఉంటారు.
ఎందుకంటే ఇది పచ్చిగా కూడా తీయగా, దుంపల మాదిరిగా ఉంటాయి.కనుక వీటిని చాలా మంది పచ్చిగానే తింటూ ఉంటారు.
అలాగే వీటితో చాలా రకాల వంటకాలు కూడా చేస్తూ ఉంటారు.వీటితో పచ్చడి, పులావ్, మసాలా, కర్రీ, బిర్యాని, హల్వా లాంటి ఎన్నో వెరైటీ వంటకాలు చేసుకుంటారు.
అయితే క్యారెట్ లను తినడంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది.అదేమిటంటే క్యారెట్లను నేరుగా పచ్చిగా తింటే మంచిదా? లేక జ్యూస్ తాగితే మంచిదా? అని ఆలోచిస్తూ ఉంటారు.

అయితే దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.క్యారెట్లన్నీ జ్యూస్( carrots juice ) లా కాకుండా పచ్చిగా నేరుగా తింటేనే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే క్యారెట్లను పచ్చిగా తినేందుకు కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఆ సమయంలో నోట్లో బాగా నమిలి తింటారు.దీంతో నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది.
ఇది పొట్టకు ఎంతగానో మేలు చేస్తుంది.అలాగే ఇది పొట్టలోకి వెళ్లడం వలన జీర్ణ క్రియ( Digestion ) మెరుగుపడుతుంది.
దీంతో జీర్ణ సమస్యలు( Digestive problems ) లాంటివి ఉంటే తగ్గిపోతాయి.అలాగే క్యారెట్లను తినేందుకు సమయం పడుతుంది.
కనుక ముఖానికి చక్కని వ్యాయామం కూడా అవుతుంది.

కాబట్టి క్యారట్ లను పచ్చిగా నేరుగా తీసుకోవడం ఉత్తమం.ఇక చాలామంది క్యారెట్లను ఉదయం పూట తీసుకుంటూ ఉంటారు.అయితే ఆ సమయంలో ఆఫీసులకు బయటకు పనికి వెళ్తారు.
అందుకే ఉదయం సమయంలో క్యారెట్లను తింటాం అనుకుంటే, అలాంటప్పుడు జ్యూస్ తాగితేనే బెటర్.ఎందుకంటే సమయం ఆదా అవుతుంది.
జ్యూస్ లా తాగితే ఎక్కువ సమయం పడదు.టైం లేదని భావించిన ప్రతి ఒక్కరు కూడా జ్యూస్ లా తాగవచ్చు.
ఇలా క్యారెట్ లను ఎవరికి వారు తమ సౌకర్యానికి అనుగుణంగా తీసుకోవచ్చు.కానీ ఎలా తీసుకున్నా కూడా క్యారెట్ ల వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది.
అలాగే వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.