చెమట వాసన లేదా శరీర దుర్వాసన.ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.
ముఖ్యంగా కొందరికి అయితే వేడి వాతావరణంలోనే కాదు.చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టేస్తుంటాయి.
అయితే వాస్తవానికి చెమట రావడం వల్ల ఎలాంటి నష్టం లేదు.కానీ, ఆ చెమట వల్ల వచ్చే దుర్వాసన మాత్రం తమకే కాదు.
పక్కని వారిని కూడా ఆసౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.ఇక శరీరంలోని కొన్నిప్రదేశాల్లోనే ఎక్కువగా చెమట పడుతుంటుంది.
ముఖ్యంగా అండర్ ఆమ్స్ పట్టే చెమట వల్ల బట్టలే తడిచిపోతుంటాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.
చెమల వల్ల వచ్చే చెడు వాసనకు సులువుగా చెక్ పెట్టవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.
నిమ్మరసం చెమట వల్ల వచ్చే దుర్వాసనను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే నిమ్మరసం దుర్వాసకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
అందువల్ల, స్నానం చేసే వాటర్‌లో నిమ్మరసం కలిపి చేస్తే చమట వాసనకు చెక్ పెట్టవచ్చు.
నేచురల్ యాంటీ బాక్టీరియల్ సోప్ వాడడం మరియు వేడి నీటితో రోజుకు రెండు సార్లు చేయాలి.
తద్వారా చమట వల్ల వచ్చే వాసన తగ్గుతుంది.ఇక చాలా మంది స్పానం చేసిన వెంటనే పౌడర్లు రాసుకుంటుంటారు.
కానీ, అలా ఎట్టి పరిస్తితుల్లోనూ చేయరాదు.అయితే పౌడర్లకు బదులుగా మాయిశ్చరైజర్‌ను శరీరానికి అప్లై
చేసుకుంటూ చెమట వాసన తగ్గుతుంది.
అలాగే గ్రీన్ టీ కూడా చెమట వాసన తగ్గించగలదు.గ్రీన్ టీని బాగా చెమట పట్టే ప్రదేశంలో అప్లై చేయడం లేదా స్నానం చేసే నీటితో గ్రీన్ టీ కలిపి చేయడం వంటివి చేస్తే దుర్వాసనను నియంత్రించవచ్చు.
ఇక తినే ఆహారం బట్టీ కూడా చెమట వాసన వస్తుంటుంది.కాబట్టి.
మసాలా, ఆల్కహాల్, కెఫైన్, రెడ్ మీట్ వంటి వాటికి దూరంగా ఉండడండి.