జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

2029 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు వైసీపీ అధినేత జగన్.( YS Jagan ) 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే వైసీపీ( YCP ) పరిమితం కావడం వెనుక జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటి జగన్ గుర్తిస్తూ, దానికి అనుగుణంగా మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు.

 Did Jagan Know The Mistake Ready To Cleanse Details, Jagan, Ysrcp, Ap Government-TeluguStop.com

  గత ఐదేళ్లలో తన పాలనలో చేసిన తప్పులు ఏమిటనేది జగన్ గుర్తించారు.పూర్తిగా సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకోవడం, అవే తమక ఓట్లు తీసుకొస్తాయనే నమ్మడంతోనే తమకు ఈ పరిస్థితి వచ్చిందని , అలాగే తాను పూర్తిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పరిమితం కావడం,  క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది తెలుసుకునేందుకు కేవలం కొంతమంది అధకారులపైనే ఆధారపడడం వంటివి తనను ప్రజలకు దూరం చేసింది అని, వాలంటీర్ వ్యవస్థతో( Volunteer System ) తాను కొత్త వ్యవస్థను తీసుకువచ్చినా, 

Telugu Ap, Chandrababu, Perni Nani, Jagan, Ycp, Ysrcp-Politics

అది వర్కౌట్ కాలేదని,  ప్రజల సంక్షేమం ఒక్కటే కోరుకోలేదని,  అభివృద్ధి కూడా కోరుకున్నారని కానీ ఆ విషయంలో తప్పు చేశామనే విషయాన్ని జగన్ గ్రహించారు.ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను దూరం చేసుకోవడం వైసిపి ఘోర ఓటమికి ఒక ప్రధాన కారణం గా జగన్ భావిస్తున్నారు.ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ సభలో మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) వెల్లడించారు.జగన్ జనాలను బాగు చేద్దామని కార్యకర్తలను మరచిన మాట వాస్తవమేనని అంగీకరించినట్లు నాని వ్యాఖ్యానించడంతో,  జగన్ లో మార్పు వస్తున్నట్లు అర్థమవుతుంది .2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కష్టపడిన పార్టీ కార్యకర్తలు 2024లో ఆ స్థాయిలో వైసీపీ విజయానికి కృషి చేయకపోవడం, పార్టీని గెలిపించుకోవాలని పట్టుదల చూపించకపోవడం వంటివి ఓటమికి కారణాలుగా జగన్ భావిస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Perni Nani, Jagan, Ycp, Ysrcp-Politics

తన సొంత జిల్లా కడప నియోజకవర్గంలోనూ తనకు పట్టున్న రాయలసీమ ప్రాంతంలోనూ వైసీపీ వెనకబడడానికి ఇదే కారణం అని జగన్ గ్రహించారు.తాను జనంలో లేకపోవడం కూడా ఒక కారణంగా గుర్తించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడంతో, వారు ఆర్థికంగా అన్ని రకాలుగాను నష్టపోయారని , అందుకే 2024 ఎన్నికల్లో అంత సీరియస్ గా వైసీపీ విజయానికి కృషి చేయలేదని జగన్ గ్రహించారు.అందుకే 2029 ఎన్నికల వరకు పూర్తిగా జనాల్లోనే ఉంటూ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు.

జనాల కంటే ముందుగా పార్టీ కార్యకర్తల్లో నమ్మకం సంపాదిస్తే వచ్చే ఎన్నికల్లో తిరుగు ఉండదనే విషయాన్ని ఆలస్యంగానైనా జగన్ గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube