ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మైగ్రేన్( Migraine ) బారిన పడుతున్నారు.ఇది మామూలు తలనొప్పి కంటే చాలా బాధాకరంగా భయంకరంగా ఉంటుంది.
మైగ్రేన్ సాధారణంగా తలకు ఒకవైపు వస్తుంది.ఇది దాదాపు నాలుగు గంటలు ఉంటుంది.
కొందరిలో రోజులు తరబడి కూడా ఉంటుంది.మైగ్రేన్ కారణంగా ఎందరో మంచానికే పరిమితం అవుతుంటారు.
అయితే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి కొన్ని పానీయాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.ఈ నేపథ్యంలోనే మైగ్రేన్ తలనొప్పిని తరిమికొట్టే టాప్ అండ్ బెస్ట్ డ్రింక్స్ ఏవే ఇప్పుడు తెలుసుకుందాం.
మామూలు తలనొప్పి మరియు మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందడానికి అల్లం టీ( Ginger Tea ) చాలా ఉత్తంగా సహాయపడుతుంది.అల్లం రక్త నాళాలను విశ్రాంతి తీసుకోవడానికి మరియు మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
అందువల్ల మైగ్రేన్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు మీరు ఉపశమనం కోసం అల్లం టీను ప్రయత్నించవచ్చు.
మైగ్రేన్ తలెత్తడానికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం.అందువల్ల బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవాలి.నిమ్మకాయ నీరు( Lemon Water ) మిమ్మల్ని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి మరియు మైగ్రేన్ ను తరిమికొట్టడానికి సహాయపడుతుంది.
సో.ఒక గ్లాస్ వాటర్ తో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెస్ లెమన్ జ్యూస్ మరియు చిటికెడు హిమాలయన్ సాల్ట్ కలిపి తీసుకోండి.
పాలకూరలో( Spinach ) ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.ఫోలిక్ యాసిడ్ ను తీసుకోవడం మైగ్రేన్ లక్షణాలను అడ్డుకోవడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.బ్లెండర్ లో గుప్పెడు పాలకూర ఆకులకు ఒక అరటిపండు, వన్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్ మరియు ఒక గ్లాస్ ఆల్మండ్ మిల్క్ ను జోడించి స్మూతీ తయారు చేసుకుని తీసుకుంటే మైగ్రేన్ పరర్ అవుతుంది.
ఇక చమోమిలే టీ, పిప్పరమెంటు టీ, లవంగం టీ, పసుపు టీ, ఫ్రూట్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్, గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ వంటి పానీయాలు కూడా మైగ్రేన్ తలనొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి సహాయపడతాయి.