త్రిమధుర ప్రసాదం అంటే ఏమిటి?

ప్రసాదం అంటే భగవంతుని సమర్పించిన ఆహారాన్ని భక్తులకు ఇచ్చే దానిని ప్రసాదం అంటారు.ఇది హిందూ మతం, సిక్కు మతం  సహా పలు మతాల్లో ఈ సాంప్రదాయం ఉంటుంది.

 What Is Trimadhura Prasadam, Devotional, Prasadam, Telugu Devotional, Trimadhura-TeluguStop.com

దీనిని సాధారణంగా దేవతారాధకులకు, భక్తులకు పంచి పెడుతుంటారు.భగవంతునికి లేదా గురువుకు, పెద్దలకు, ఆరాధ్యులకు మనస్ఫూర్తిగా ఆహారం నివేదిస్తారు.

దానిని అనంతరం భక్తులకు పంచి పెట్టడాన్ని ప్రసాదం అంటారు.సాధారణంగా దీనిని వివక్ష లేకుండా ప్రజలందరికీ పంచి పెడతారు.

దేవుళ్లతో పాటు పెద్దలకూ ప్రసాదం సమర్పిస్తారు.దీనిలో లడ్డూలు, పులిహోర, అటుకుల పాయసంతో పాటు గారెలు, బూరెలు, అటుకులు, దద్యోజనం లాంటి చాలా రకాల వంటకాలు వండి భగవంతునికి సమర్పిస్తారు.

సాధారణంగా ప్రసాదంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఇతర మసాలాలు కలపరు.ఇవి కలపడం వల్ల మానసిక ఉద్రేకం కలిగించే నిషేధిత మసాలా వస్తువులతో తయారు చేసిన ఆహారాలను దేవతలకు నివేదించడంలలో మినహాయించబడింది.

మాములుగా అయితే ఒక్కో దేవునికి ఒక్కో రకమైన ప్రసాదం వండి సమర్పిస్తారు.అవి కేవలం ప్రసాదాల్లాగే కాకుండా… మంచి గుర్తింపును సంపాదించుకుంటాయి.ఉదాహరణకు తిరముల లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇలా చాలా ఫేమస్ అయిన ప్రసాదాలు ఉంటాయి. కొబ్బరీ, అరటి పండూ, బెల్లమూ వీటిని త్రిమధురము అంటారు.

ఆయుర్వేదపరంగా శరీరానికి ఈ ప్రసాదం ఎంతో మేలు చేస్తుంది.అల్సర్ వంటి వాటికి అమృతము వలే పని చేస్తుంది.

అందుకే మన పెద్దలు అలాంటి ఆచారాన్ని ఆధ్యాత్మికంలో కలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube