మన దేశంలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతునికి పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.అలాగే అభిషేక ప్రియుడైన ఆ దేవ దేవునికి ఈ దేవాలయంలో అభిషేకం జరగదు.
ఇప్పటికీ దేవాలయా గర్భాలయంలో ఎర్రటి చీమలు తిరుగుతూ ఉంటాయి.దేవాలయంలో ఇద్దరు ధ్రువ మూర్తులు కొలువై ఉన్నారు.
దక్షిణా ముఖంగా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.అభిషేక ప్రియుడికి అభిషేకం ఎందుకు జరగదు? ఆ దేవాలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.మన రాష్ట్రంలోనీ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన ద్వారకా తిరుమల శేషాచల కొండపై ( Dwarka Tirumala )కొలువైన చిన వెంకన్న దివ్య క్షేత్రాన్ని ప్రతిరోజు ఎన్నో లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.
ద్వారక తిరుమలను చిన తిరుపతి ( Tirupati )అని కూడా అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ( Lord Venkateswara )అభిషేక ప్రియుడు కానీ ద్వారక తిరుమల చిన్న వెంకన్నకు మాత్రమే అభిషేకం జరగదు.స్వామి వారు కొలువైన అంతరాలయంలో ఒక్క బొట్టు నీటి చుక్క పడిన ఆలయమంతటా స్వామివారి విగ్రహాల కింద నుంచి కొనిజులు అనే ఎర్ర చీమలు బయటకు వస్తాయి.
అలా వచ్చిన ఎర్ర చీమలు( Red ants ) స్వామివారి అంతరాలయం అంతటా వ్యాపిస్తాయి.ఎందుకంటే స్వామి వారు స్వయంభు మూర్తి సగభాగం ఇప్పటికీ వల్మీకం లోనే కప్పబడి ఉందని ఏమాత్రం అక్కడ నీళ్లు ఒలికిన ఒక వర్ణికంలోంచి కొనిజులు అనే ఎర్ర చీమలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తాయి.
ఆ కారణం చేత ఇక్కడ ధ్రువమూర్తులకు అభిషేకం నిర్వహించమని ఆలయ అర్చకులు చెబుతున్నారు.అంతే కాకుండా ఎవరైనా మైళ తో దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఎర్ర చీమలు బయటికి వస్తాయని అర్చకులు చెబుతున్నారు.స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి ప్రతి రోజు ప్రత్యేక పుల తో స్వామి వారిని అలంకరిస్తారు.అలా అలంకరణ చేసిన పూలలో అప్పుడప్పుడు ఎర్ర చీమలు కనిపిస్తూ ఉంటాయి.
DEVOTIONAL