మన పూర్వీకుల కాలం నుంచి రాశి ఫలాలను, జాతకాలను చాలామంది నమ్ముతూ వస్తున్నారు.వీటితోపాటు మన దేశంలో చాలామంది ప్రజలు చేతి రేఖలను కూడా నమ్ముతారు.
ఈ రాశి ఫలాలను కొంతమంది ప్రజలు మూడు నమ్మకాలు అని కూడా అంటారు.మన దేశంలో చిలక జోష్యాలను నమ్మేవారు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రస్తుతం కూడా మనదేశంలో చాలామంది ప్రజలు రాశి ఫలాలను బలంగా నమ్ముతారు.అలాగే రాబోయే రోజులలో ఈ మూడు రాశుల వారికి రాజయోగం వస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు.
వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని కూడా చెబుతున్నారు.ఈ రాశులకు మాత్రమే అలా ఎలా చెబుతారు అన్న ప్రశ్నకు కొంతమంది జ్యోతిష్యులు మాట్లాడుతూ వారి గ్రహాలు, రాశి చక్రాలను ఆధారంగా వారికి రాజయోగం ఉందని చెబుతారు.
ఆ మూడు రాశులు వరుసగా వృశ్చిక రాశి, కన్య రాశి, సింహరాశి.అక్టోబర్ 10వ తేదీ వరకు కుజుడు వృషభ రాశిలో ఉంటాడు.ఇలా ఉండటం వల్ల అన్ని రాశులు ప్రభావితమవుతాయి.అప్పుడు ఈ మూడు రాశుల వారి కి రాశి చక్ర గుర్తులు వారికి రాజయోగాన్ని కలిగిస్తాయి.
వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో ఆదాయం పెరగవచ్చు.ఈ రాశి వారి పనితీరు కూడా మెరుగుపడుతుంది.
కన్య రాశి లోకి కుజుడు ప్రవేశించినప్పుడు వెంటనే ఈ రాశి వారికి శక్తివంతమైన రాజయోగం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ఈ రాశి వారి నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి.విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు.కొంతమంది ఈ రాశి వారు వ్యాపార ప్రయాణాలు కూడా చేస్తారు.చివరిగా సింహరాశి ఈ రాశి వారికి ఉన్న జాబ్ కంటే ఇంకా మంచి జాబ్ ఆఫర్లు వస్తాయి.పెద్ద పెద్ద వ్యాపారాల కు సంబంధించిన వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి.