హనుమంతుణ్ణి నవ వ్యాకరణ పండితుడని ఎందుకు అంటారు?

హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు ఆంజనేయ స్వామి లేకుంటే రావాణాసురుడిని రాముడు జయించడం చాలా కష్టం అయ్యేది.

 Why Is Hanuman Called Navya Vyakarana Pandithudu Details, Anjaneya Swamy, Hanuma-TeluguStop.com

అంత ఎందుకు సీతమ్మ తల్లి జాడను కనుక్కోవడం కూడా కుదరకపోయేది.అయితే హిందువులు ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎలా రక్షించాలి అని చెప్పే హిందూ ధర్మానికి ప్రతీక ఆంజనేయ స్వామియే.

అలాంటి ఆంజనేయ స్వామికి తెలియని విద్యలంటూ లేవు.కాకపోతే మునుల శాపం వల్ల ఆయనకు తన శక్తి తెలియకుండా పోయింది.

ఎవరైనా గుర్తు చేస్తే తప్ప ఆయన బలం ఆయనకు తెలిసేది కాదు.అది గుర్తించిన శ్రీరామ చంద్రుడు… అన్ని వేళలా అంజన్నకు శక్తి వచ్చేలా తన బలాన్ని గురించి తనకు వివరించేవాడు.

శ్రీమద్ రామాయణంలోని కిష్కింధ కాండలో మొట్ట మొదట రామ లక్ష్మణులను ఆంజనేయ స్వామి దర్శించి వారెవరో తెలుసుకోవాలని అడుగుతాడు.దూతగా వచ్చి వారి వివరాలు అడిగే విధానాన్ని గమనించిన దాశరధి సౌమిత్రితో ఋగ్, యజుర్, సామ వేదాలు, వేదాంగాలను అధ్యయనం చేయని వాడు ఈ విధంగా మాట్లాడ లేడు అని అతణ్ణి అభినందిస్తాడు.

శ్రీ సూర్య భగవానుని నుండి రామ దూత శాస్త్ర అధ్యయనం చేశాడు.నవ వ్యాకరణాలు అంటే 1.పాణినీయం 2.కలాపం 3.సుపద్మం, 4.సారస్వతం 5.ప్రాతిశాఖ్యం 6.ఐంద్రం 7.వ్యాఘ్రభౌతికం 8.శఖటాటాయనం 9.శాకల్యం (ప్రాతిశాఖ్య నికి కుమార వ్యాకరణం అని మారుపేరు ఉంది)లను అవపోసన పట్టాడు.అందుకే ఆయనను నవ వ్యాకరణ పండితుడిని అంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube