పక్కా కమర్షియల్ ఈవెంట్ లో మరో బండ్ల గణేష్..!

ఈవెంట్ లో సందడి రావాలంటే ఎవరో ఒకరు ఓ రేంజ్ లో మాట్లాడాల్సిందే.

అభిమానం ఎంత ఉన్నా సరే మాట్లాడాల్సిన టైం లో మైక్ పట్టుకుని మాట్లాడటం అనేది ఓ గొప్ప టాలెంట్.

ఈ విషయంలో అందరికి నిర్మాత బండ్ల గణేష్ స్పూర్తిగా నిలుస్తాడు.పవర్ స్టార్ మీద అభిమానంతో మైక్ అందుకుంటే చాలు బండ్ల గణేష్ స్పీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా అతన్ని చూసి అలా మాట్లాడాలని అనుకున్నారో లేక మరేమో కానీ ఆదివారం జరిగిన పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముందు ఆయన గురించి మరో బండ్ల గణేష్ లా మాట్లాడాడు నిర్మాత ఎస్.కె.ఎన్.మైక్ అందుకోగానే ముందు ఎమోషనల్ అయిన ఎస్.కె.ఎన్ భారత దేశానికి సరిహద్దులు తూర్పున హిమాలయాలు, పచ్చిమాన బంగాళాఖాతం అంటారు కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎవరైనా అవసరంలో ఉన్నారు అంటే ఈస్ట్ మెగాస్టార్ వెస్ట్ మెగాస్టార్ నార్త్ మెగాస్టార్ సౌత్ మెగాస్టార్ అని ఊపు తెప్పించే స్పీచ్ మొదలు పెట్టారు ఎస్.కె.ఎన్.తాను ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల బ్యానర్ లు కడుతుండే వాడిని అలాంటిది మెగా బ్యానర్ లో కో ప్రొడ్యూసర్ గా ఎదగడానికి కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక స్పూర్తి అని అన్నారు ఎస్.కె.ఎన్.ఎదురుగా మెగాస్టార్ ఉన్నా ఆయన ముందు తల ఎత్తి చూడలేను ఎందుకంటే బాస్ కళ్లల్లోకి చూడలేం కాబట్టి తనలాంటి ఎంతోమందికి స్పూర్తి ఒకే ఒక్కడు అందరి వాడు చాలామందికి అందని వాడు మెగాస్టార్ చిరంజీవి అని అదిరిపోయే స్పీచ్ తో నిర్మాత ఎస్.కె.ఎన్ మరో బండ్ల గణేష్ లా పక్కా కమర్షియల్ ఈవెంట్ లో అదరగొట్టారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు