వ్యాధులలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే అది బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పాలి.ఈ వ్యాధి రావడానికి కారణాలు మెదడులో సిరలు పగిలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి.
అలాగే సిరలలో లో ఫలకం పేరుకుపోయిన కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత చాలామందికి తర్వాత హెమరేజిక్స్ స్ట్రోక్ కూడా వస్తోంది.
ఇది చాలామందికి ప్రాణాంతకంగా మారుతుంది.
ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ అనేది అధిక రక్తపోటు ఉన్న వారిలో ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే ప్రతిరోజు తీసుకుంటున్న పలు ఆహారాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు ఉన్నవాళ్లు బ్రెడ్ తీసుకోవడం అంత మంచిది కాదు.బ్రెడ్ లో సోడియం లేబుల్ అధిక పరిమాణంలో ఉంటుంది.

అందుకే ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రాణంతంగానూ మారే అవకాశాలు ఉన్నాయి.అలాగే చాలామంది శాండ్విచ్లు తింటూ ఉంటారు.అందుకే వీటిని తినడం మానుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అలాగే సోడియం కలిగిన ఆహారాలు అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.అలాగే అతిగా గుడ్లు తినడం కూడా మంచిది కాదని అలా తింటే ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ప్రతిరోజు గుడ్లు, ఆమ్లెట్ తినడం వల్ల మెదడులో సిరలు పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది.అలాగే చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.అందుకే వీటిని తినకపోవడమే చాలా మంచిది.
ఇక బిపి పేషెంట్ వేయించిన పదార్థాలు తినడం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.వీటిని అతిగా తినడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది.
దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.అందుకే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని తినకపోవడమే మంచిది.