చలి కాలం స్టాట్ అయిపోయింది.ఈ కాలంలో రోగాల బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ.
ముఖ్యంగా ఈ కాలంలో చాలా మంది జలుబు, దగ్గు, నిమోనియా లాంటి శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంటారు.అందుకే చలికాలం ప్రారంభం నుంచే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అయితే ఈ కాలంలో చాలా మంది జామ కాయ తినొద్దని.జామ కాయ జలుబు చేస్తుందని అంటుంటారు.
కానీ, అందులో ఎలాంటి నిజం లేదు.వాస్తవానికి ఈ కాలంలో జామ కాయ తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.
అవేంటో లేట్ చేయకుండా చూసేయండి.
జామ కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.తద్వారా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
మధుమేహం.ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
అలాంటి వారు జామ కాయ తీసుకోవడం వల్ల.అందులో పుష్కలంగా ఉండే పీచు పదార్ధం రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులోకి తెస్తాయి.

అలాగే థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారికి జామ కాయ తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే.జామ కాయలో ఉండే కాపర్.థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది.జామ కాయలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ప్రతి రోజు గింజలు లేకుండా ఒక జామ కాయ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.

అలాగే బి3, బి6 విటమిన్లు పుష్కలంగా ఉండే జామ కాయ ప్రతి రోజు తీసుకోవడం వల్ల మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.ఇక బరువు తగ్గాలనుకునే వారికి జామ కాయను ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే.జామలో కొవ్వు, క్యాలరీలు చాలా తక్కువగా.పోషకాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, జామ కాయను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు.ఫలితంగా బరువు తగ్గొచ్చు.