ముఖ చర్మంపై ఎటువంటి మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అయితే అటువంటి చర్మాన్ని పొందడం అసాధ్యమని ఎక్కువ శాతం మంది భావిస్తారు.
కానీ సాధ్యమే.హెల్తీ లైఫ్ స్టైల్, మంచి ఆహారం నిత్యం వ్యాయామం తో పాటు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం( Homemade Serum ) మొండి మచ్చలను పోగొట్టి ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించడానికి చాలా బాగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో నాలుగు రెబ్బలు వేపాకు,( Neem Leaves ) ఒక కప్పు గులాబీ రేకులు,( Rose Petals ) కొన్ని నిమ్మ తొక్కలు, కొన్ని ఆరెంజ్ తొక్కలు, పది వరకు లవంగాలు, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి పసుపు తురుము వేసుకుని ఉడికించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఉడికించిన పదార్థాల నుంచి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక ఆ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది సిద్ధమవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు మరియు ఉదయం స్నానం చేయడానికి రెండు గంటల ముందు తయారు చేసుకున్న సీరంను ముఖ చర్మానికి అప్లై చేసుకోవాలి.

రోజుకు రెండుసార్లు ఈ హోమ్ మేడ్ సీరం కనుక వాడితే ముఖంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా తగ్గుముఖం పడతాయి.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
స్కిన్ కలర్ ఈవెన్ గా మారుతుంది.మచ్చలన్ని పోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
మొటిమల సమస్య తగ్గు ముఖం పడుతుంది.మరియు ఏజింగ్ ప్రక్రియ సైతం నెమ్మదిస్తుంది.