ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది అధిక బరువు ( overweight )సమస్యతో బాధపడుతున్నారు.ఓవర్ వెయిట్ కారణంగా బాడీ షేప్ అవుట్ అవ్వడమే కాదు అనేక రోగాలను ఆహ్వానించినట్లు అవుతుంది.
ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలి అనుకుంటే కచ్చితంగా బాడీ వెయిట్ ను అదుపులోకి తెచ్చుకోవాలి.అందుకోసం కఠినమైన డైట్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
కొన్ని కొన్ని జాగ్రత్తలతో పాటు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ డ్రింక్ ను కనుక తీసుకుంటే సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క( ginger ), రెండు పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves ) మరియు ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన వెయిట్ లాస్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.తద్వారా మెటబాలిజం రేటు పెరుగుతుంది.క్యాలరీలు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.ఫలితంగా మీరు బరువు తగ్గుతారు.ఇక ఈ డ్రింక్ ను తీసుకోవడంతో పాటు రెగ్యులర్ గా అరగంట పాటు వ్యాయామం చేయండి.బయట ఆహారాలకు దూరంగా ఉండండి.
షుగర్, మైదా, ఆయిలీ ఫుడ్స్ ను దూరం పెట్టండి.తాజా కూరగాయలు, ఆకుకూరలు, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, పాలు, పాల ఉత్పత్తులు వంటివి ఆహారంలో భాగం చేసుకోండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మానుకోండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సులభంగా మరియు వేగంగా శరీర బరువును అదుపులోకి తెచ్చుకోవచ్చు.
మళ్ళీ నాజూగ్గా మారొచ్చు.