కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తూంటాయి అన్న విషయం తెలిసిందే కేవలం ఒక్క రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనూహ్యమైన మార్పులు వచ్చాయి.
ఒకప్పుడు టాలీవుడ్ అంటే కేవలం సౌత్ కి మాత్రమే పరిమితం అయ్యేది.కానీ గత ఐదేళ్ళ కాలంలో ఏకంగా టాలీవుడ్ లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమాలు వచ్చాయి.
దీంతో అందరి చూపు టాలీవుడ్ వైపే మళ్లింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే ఇలాంటి టైంలోనే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పడింది అనే విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న దర్శకులు అందరూ కూడా ఒకే గొడుగు కింద చేరి ఇక కంటెంట్ని మరింత డెలివలేప్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ పాపులర్ డైరెక్టర్లతో యాక్టివ్ గిల్డ్ కి అటు దర్శక ధీరుడు రాజమౌళి సారధ్యం వహిస్తూ ఉండటం గమనార్హం.ఇక ఆయనతో పాటు మరో నలుగురు సీనియర్ డైరెక్టర్లు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారట.ఇక టాలీవుడ్ లో కథలు ఎలా ఉండాలి.సినిమాల క్వాలిటీ ఎలా పెంచాలి.ఇక టాలీవుడ్ లో తీసే సినిమాల ను అటు పాన్ ఇండియా గా ఎలా మార్చాలి.
దర్శకులకు ఉన్న సమస్యలను పరిష్కరించడం ఎలా అన్న విషయంపై ఇందులో చర్చిస్తారట.
ఇక దీనికోసమే ప్రస్తుతం ప్రత్యేకమైన యాక్టివ్ డైరెక్టర్స్ గిల్డ్ ని ప్రారంభించారు అన్నది తెలుస్తుంది.ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఉన్న పలు సమస్యలపై రెండు మూడుసార్లు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది.ఇక ఇందులో ఉన్న 21 మంది సభ్యులు ఎవరు అన్న వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్.ఎస్.రాజమౌళి- వీవీ వినాయక్ – త్రివిక్రమ్ శ్రీనివాస్- కొరటాల శివ- సుకుమార్- శేఖర్ కమ్ముల -బోయపాటి శ్రీను- క్రిష్ – హరీష్ శంకర్- వంశీ పైడిపల్లి- చంద్రశేఖర్ ఏలేటి- మారుతి- అనీల్ రావిపూడి- చందు మొండేటి- సందీప్ రెడ్డి వంగా- ఇంద్రగంటి మోహన్ కృష్ణ- నాగ్ అశ్విన్- నందిని రెడ్డి- శివా నిర్వాణ వేణు- శ్రీరామ్- తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు ఇందులో ఉన్నారు.అయితే ఇప్పుడు ఎందుకో ఈ సంఘం మాత్రం ఆక్టివిటీ పరంగా ఎంతో వెనుకబడిపోయింది అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
డైరెక్టర్లు బిజీ కావడం కారణంగానే ఇది జరుగుతుందని తెలుస్తుంది.ఇది పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్న సినిమాలు చూస్తే రానున్న రోజుల్లో హాలీవుడ్ రేంజ్ కు చేరుతుంది సందేహం లేదు అని కొంతమంది సినీ విశ్లేషకులు.
అయితే ముందు దర్శకులు అందరూ కూడా ఇక సంఘాన్ని కొనసాగించాలంటే మాత్రం రానున్న రోజుల్లో వారికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం అన్నది అందరూ అనుకుంటున్న మాట.