మ‌క‌ర సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు?

సూర్య భగవానుడు జనవరి 14న రాత్రి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.అందుకే జనవరి 15న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు.

 What To Do On Makara Sankranti? What Not To Do, Makara Sankranti , Devotional ,-TeluguStop.com

ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాన ధర్మాల ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఏం చేయాలి?

పవిత్ర నదిలో స్నానం:

శాస్త్రాల ప్రకారం, మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది మరియు మోక్షం లభిస్తుంది.గంగానదిలో స్నానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు.గంగాస్నానం చేయలేని పక్షంలో ఇంట్లో గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయండి.

సూర్య భగవానుడికి అర్ఘ్యం:

మకర సంక్రాంతి పండుగ సూర్య భగవానుడికి ప్రితిపాత్ర‌మైన‌ది.కాబట్టి ఆ రోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయండి.

ఆ తరువాత, నీటిలో కుంకుడు మరియు నల్ల నువ్వులను వేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.ఈ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.

దానం:

శాస్త్రాల ప్రకారం మకర సంక్రాంతి నాడు దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.ఆ రోజున చేసే దానం నేరుగా భగవంతుడికి చేరుతుంది.

త‌ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు.మకర సంక్రాంతి నాడు పేదలకు దానం చేయాలి.ఈ రోజు దానం చేయడం వల్ల సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది.

పూర్వీకులకు నైవేద్యాలు:

మకర సంక్రాంతి రోజున పూర్వీకుల పేరిట నైవేద్యాలు సమర్పించాలి.దీని వల్ల ఇంట్లో పితృదోషం జరగదు.సంక్రాంతి రోజున భగీరథుడు తన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని గంగానదిలో తర్పణం వ‌దిలాడు

Telugu Alcohol, Devotional, Nadhi Snanam, Pitru Paksha, Surya Bhagavan-General-T

చేయ‌కూడ‌నివి

స్నానానికి ముందు ఏమీ తినకూడదు:

మకర సంక్రాంతి రోజున గంగా నదిలో లేదా మరేదైనా నదిలో స్నానం చేసి దానం చేసిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి.ఏ కారణం చేతనైనా నదిలో స్నానం చేయలేక పోతే ఇంట్లో స్నానం చేసి, దానధర్మాలు చేశాక‌ ఏదైనా తినండి.

మద్యం సేవించవద్దు:

మకర సంక్రాంతి నాడు మద్యం సేవించడం వల్ల జీవితంపై చెడు ప్రభావం పడుతుంది.ఇది ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.ఆ రోజున మద్యం సేవించడం వల్ల ఇంటిలోని ఆనందం, శ్రేయస్సు దూరమవుతాయి.

Telugu Alcohol, Devotional, Nadhi Snanam, Pitru Paksha, Surya Bhagavan-General-T

పేదలను అవమానించవద్దు

: ఆ రోజున పేదవారిని లేదా నిస్సహాయులను అవమానించవద్దు.ఇలా చేయడం వల్ల పాపానికి భాగస్వాములు అవుతారు.ఆ రోజున ఎవరూ చెడు మాటలు మాట్లాడకూడదు.ఇంట్లో ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే ఖాళీ చేతులతో పంప‌కూడ‌ద‌నే విష‌యం గుర్తుంచుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube