మనదేశంలో చాలామంది ప్రజలు జాతకాలంటే నమ్మకం లేని వారు ఉంటారు.అలాగే జాతకాలను నమ్మే వాళ్లు ఇంకా ఎక్కువే ఉంటారు.
ఒక్కొక్కరూ ఒక్కో రకం జాతకాన్ని, జ్యోతిష్యాన్ని నమ్ముతారు.మన చేతుల్లో రేఖలను చూసి కూడా మన జాతకాన్ని చెబుతారు జ్యోతిష్యులు.
మన అర చేతుల్లో అనేక రేఖలు ఉంటాయి.వాటిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రేఖల మధ్యలో ఎక్స్ ఆకారంలో ఏదైనా గుర్తు ఉంటుంది.
ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది.ప్రపంచంలో కొద్ది మంది చేతుల్లోనే ఈ ఎక్స్ గుర్తు ఉంటుంది.
చేతి రేఖల్లో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉన్న వారు అత్యంత ప్రతిభావంతులవుతారు.
ఈ గుర్తు ఉన్నవారు వారితో పాటు ఇతరులను కూడా విజయపథంలో నడిపిస్తారట.
విరు గొప్ప నాయకులుగా అవుతారట.అర చేతిలో కనుక ఎక్స్ ఆకారంలో గుర్తు ఉంటే వారు ప్రపంచాన్నే జయిస్తారట.
ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ కు కూడా అరచేతిలో ఎక్స్ ఆకారంలో గుర్తు ఉండేదట.అందువల్లే ప్రపంచాన్ని జయించాడని చరిత్ర చెబుతుంది.
దీనిపై కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేశారు.వీరు అనేక మంది చేతి రేఖలను పరిశీలించారు.

వీరు పరిశీలించిన చేతి రేఖల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్ లు కూడా ఉన్నారు.వీరు నాయకులు మాత్రమే కాదు చాలా ప్రతిభావంతులు కూడా.ఇలా గుర్తు ఉన్న వారు ప్రణాళిక లేకుండానే ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారట.వీరు శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారట.వీరు తమతో పాటు ఇతరుల జీవితాల్లో కూడా మార్పు తేగలరని పరిశోధకులు చెబుతున్నారు.తమ పదునైన ఆలోచనలతో తిరుగులేని విజయతీరాలకు చేరుతారట.
అంతులేని పేరు ప్రతిష్టలను కూడా సంపాదించుకుంటారట.జనాల్లో, చరిత్రలో నిలిచిపోతారట.