గ్రహాల న్యాయదేవత మరియు కర్మలను ఇచ్చే శని దేవుడు మార్చి 5వ తేదీన కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు.శని గ్రహం రాశిని మారడం వల్ల మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది.
ఇలా శని దేవుడు రాశిని మారినప్పుడు కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది.మరికొన్ని రాశుల వారికి ఆ శుభం జరుగుతుంది.
శని రాశిని మారడం వల్ల ఏ రాశుల వారికి ఇబ్బంది కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.వృషభ రాశి వారు శని రాశి మారడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉన్నత అధికారులతో వివాదాలు రావచ్చు.ఈ సమయం పెట్టుబడికి అనుకూలంగా లేదు.
కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు.అంతేకాకుండా కన్య రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఉద్యోగస్తులకు సహోద్యోగులతో ఇబ్బందులు కలుగుతాయి.ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.
చర్చలకు దూరంగా ఉండండి.మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే దానిని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి వారికి శని రాశి మారడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.ఈ రాశి వారు తల్లిదండ్రుల మద్దతును పొందుతారు.కానీ మీ ప్రియమైన వారి కారణంగా కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు.అదృష్టం లేకపోవడం వల్ల కార్యాలయాల్లో సమస్యలు వస్తాయి.వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవయ్యే అవకాశం ఉంది.మకర రాశి వారికి కూడా శని రాశి మారడం వల్ల ఈ రాశి వారి వృత్తి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది.
కుటుంబ శాంతికి భంగం కలవచ్చు.కొన్ని కారణాల వల్ల అవమానానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తోబుట్టువులతో ఆస్తి విషయంలో విభేదాలు ఏర్పడవచ్చు.ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
మీన రాశి వారికి కూడా శని రాశి మారడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి.ఈ కాలంలో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది.
భాగస్వామ్య వ్యాపారం ప్రతికూల ప్రభావం చూపుతుంది.