సినిమాల కన్నా.. ఉద్యోగం బెస్ట్ అంటున్న సీనియర్ నటీమణి

చిత్ర.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి కనీవినీ ఎరుగని రీతిలో జనాదరణ పొందిన నటీమణి.

 Actress Chitra About Problems In Film Industry, Actress Chitra , About Problems-TeluguStop.com

ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమతో పాటు సినీ తారల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. దురదృష్టం కొద్దీ ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని రోజులకే చిత్ర మరణించింది.

ఇంతకీ ఆమె చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తాను సినిమా పరిశ్రమలోకి రాకముందు అస్సలు అవగాహన లేదని చెప్పింది.

తొలి సినిమా చేసే సమయంలో ఒక సీన్ రిహార్సల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.ఆ సమయంలో డైలాగ్ చూసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్.

లైటింగ్ ఫేస్ మీద ఉండేలా చూసుకోవాలని కెమెరామెన్.హేర్ సరి చేసుకోవాలని హెయిర్ డ్రెస్సర్ చెప్పడంతో తను ఆశ్చర్యపోయినట్లు చెప్పింది.

ఒక మనిషి ఒకేసారి ఇన్ని పనులు ఎలా చేస్తారు? అనుకుందట.కానీ మూడు పనులు కాదు.

ముప్పై పనులు ఒకేసారి చేస్తేనే నటన అని తనకు అర్థం అయినట్లు చెప్పింది చిత్ర.

Telugu Problems, Actress Chitra, Chitra, Sandle Wood, Tollywood-Telugu Stop Excl

ఇప్పుడు చాలా మంది యువత సినిమాల్లోకి వచ్చి డబ్బు, పేరు సంపాదించాలని ఆశపడుతున్నారు.అయితే సినిమా రంగంలో సక్సెస్ కావడం అంత ఈజీ కాదని చెప్పింది.ఉద్యోగం చేయడం చాలా ఈజీ అని చెప్పింది.

ప్రతి ఉద్యోగానికి ఓ సమయం ఉంటుందని వెల్లడించింది.అయితే సినిమా రంగంలో అది సాధ్యం కాదని చెప్పింది.

సెలవులు, పంగడలు ఉండవని చెప్పింది.

Telugu Problems, Actress Chitra, Chitra, Sandle Wood, Tollywood-Telugu Stop Excl

ఉద్యోగ పోతే ఇంకో ఉద్యోగం చేసుకోవచ్చు కానీ సినిమా పరిశ్రమలో అది సాధ్యం కాదన్నది.సినిమా రంగం అనేది నిలకడలేని ప్రయాణం అన్నది.సినిమా రంగంలో రాణించడం కంటే బాగా చదువుకుని ఉద్యోగం చేయడం చాలా ఈజీ అన్నారు.

అన్ని రంగాల మాదిరిగానే సినిమా రంగంలోనే బాగా పోటీ పెరిగిపోయిందని చిత్ర వెల్లడించింది.గతంలో సినిమా రంగంలో నటీనటుల కెరీర్ కాలం కాస్త ఎక్కువగానే ఉండేదని.ప్రస్తుతం ఆ సమయం చాలా తగ్గిందని వెల్లడించింది.అయితే రెమ్యునరేషన్ విషయంలో గతంలో కంటే ప్రస్తుత పరిస్థితులు బాగున్నాయని చెప్పింది చిత్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube