Fruits For Skin : చర్మం నిత్యం యవ్వనంగా ఉండాలా.. అయితే ఈ పండ్లు తినాల్సిందే..?

మీ చర్మం మచ్చలు, మొటిమలతో నిండిపోయి ఇబ్బంది పడుతున్నారా? అంతేకాకుండా వయస్సు పెరుగుతున్న కొద్ది ముడుతలు( Wrinkles ) కూడా మొహంపై కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ చర్మం మెరుపుతోపాటు, మంచి రంగు కూడా వస్తుంది.

 Fruits For Skin Glowing And Whitening Tips-TeluguStop.com

దీని కోసం మీరు కొన్ని రకాల తాజా పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.అయితే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం( Food ) మన ఆరోగ్యం పై ప్రభావం చూపించడం మాత్రమే కాకుండా ఇది చర్మాన్ని చాలా కాలం పాటు మెరుస్తూ, యవ్వనంగా కూడా ఉంచుతుంది.

అయితే పెరుగుతున్న వయస్సు ప్రభావం మీ ముఖంపై కనిపించదు.చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఆహారం పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

అయితే ఇప్పుడు మనం అలాంటి కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.ఈ పండ్లు చర్మం మెరుపును, ఛాయను( Skin Glow ) కూడా మెరుగుపరుస్తాయి.సిట్రస్ పండ్లు( Citrus Fruits ):

Telugu Citrus Fruits, Fruits, Pimples, Scars, Skin-Telugu Health

చర్మ సంరక్షణలో తప్పనిసరిగా సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి.వీటిలో ఉండే విటమిన్ సి చర్మానికి ఒక వరంలా పని చేస్తుంది.అంతేకాకుండా బెర్రీలు, ద్రాక్ష( Grapes ), దాన్నిమ్మలాంటి పండ్లు కూడా యాంటీ ఆక్సిడెంట్ల నిధి.కాబట్టి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉంచుతుంది.

బొప్పాయి పండు( Papaya ):


Telugu Citrus Fruits, Fruits, Pimples, Scars, Skin-Telugu Health

బొప్పాయి పండును తీసుకోవడం వలన ముఖ ముడతలు, ఫైన్ లైన్స్( Face Wrinkles Fine Lines ) తగ్గిపోతాయి.అలాగే ఇందులో ఉండే పెప్టిన్ అనే పదార్థం చర్మానికి చాలా మేలు చేస్తుంది.

అరటిపండు( Banana ):


Telugu Citrus Fruits, Fruits, Pimples, Scars, Skin-Telugu Health

అరటి పండులో విటమిన్ ఏ, బి, ఈ పుష్కలంగా ఉంటాయి.వీటిని తినడం లేదా మొహానికి అప్లై చేయడం రెండు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇక పండిన అరటిపండును మెత్తగా చేసి ముఖానికి అప్లై చేస్తే ముడతలు కూడా పోతాయి.అలాగే ముఖంలో మెరుపు కూడా వస్తుంది.

దానిమ్మ పండు( Pomegranate ):


Telugu Citrus Fruits, Fruits, Pimples, Scars, Skin-Telugu Health

ముఖంలో మెరుపు పెంచుకోవాలంటే ఆహారంలో దానిమ్మ పండును చేర్చుకోవాలి.ఇది సూర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.అలాగే ఇందులో చాలా ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) కూడా ఉన్నాయి.ఇవి చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు చర్మం మెరిసేలా కూడా చేస్తుంది.

నిమ్మకాయలు( Lemons ):


Telugu Citrus Fruits, Fruits, Pimples, Scars, Skin-Telugu Health

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మంపై మొటిమలు, మచ్చలను( Pimples,Scars ) తొలగించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube