ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలంటే డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.ఇది అక్షరాల సత్యం.
మనం తీసుకునే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.అందుకే శరీరానికి అన్ని పోషక విలువలు అందించే ఫుడ్ డైట్ లో చేర్చుకోవాలని అంటుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఆ కోవకే చెందుతుంది.ఈ స్మూతీని ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పుల నివారణ నుంచి గుండె ఆరోగ్యం వరకు ఎన్నో లాభాలను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? దాని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వంటి విషయాలను ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
అలాగే మూడు స్ట్రాబెర్రీలను తీసుకుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, స్ట్రాబెర్రీ పీసెస్, ఐదు నుంచి ఆరు బ్లూ బెర్రీస్, వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు, ఒక కప్పు ఆల్మండ్ మిల్క్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్ట్రాబెరీ బనానా బ్లూబెర్రీ స్మూతీ సిద్దం అవుతుంది.

ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీ చేర్చుకుంటే గుండె పని తీరు మెరుగుపడుతుంది.కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.రక్త పోటు అదుపులో ఉంటుంది.వెయిట్ లాస్ అవుతారు.
జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.
మరియు స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.







