బేకింగ్ సోడా తో ఇలా చేస్తే చర్మ సమస్యలు దూరం అవ్వడంతో పాటు.. చర్మం మెరిసిపోవడం ఖాయం..!

బేకింగ్ సోడా ను( Baking Soda ) సాధారణంగా వంటల కోసం ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే పిండి వంటలు చేసేటప్పుడు బేకింగ్ సోడాను తప్పకుండా ఉపయోగిస్తారు.

 Baking Soda Treatment For Skin Problems Details, Baking Soda , Skin Problems, Bl-TeluguStop.com

కేవలం వంటలకు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను( Skin Problems ) తగ్గించుకోవడానికి కూడా బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు.చర్మ సమస్యలను తగ్గించుకోవడంలో బేకింగ్ సోడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

దీన్ని చర్మానికి పోషణతో పాటు స్క్రబ్బింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు.ఈ బేకింగ్ సోడాను సరైన విధంగా ఉపయోగించకపోతే చర్మ సమస్యలు తగ్గకుండా చర్మం మరింత పొడిబారే అవకాశముంది.

అందుకే బేకింగ్ సోడా ఉపయోగించే ముందు కొన్ని చిట్కాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

Telugu Soda, Soda Face, Black Heads, Exfoliate, Tips, Healthy Skin, Neutralizer,

ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బేకింగ్ సోడా గ్రైనీ ఆకృతి ఎక్స్‏ఫోలియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.ఎక్స్‏ఫోలియేట్( Exfoliate ) చర్మ రంధ్రాలను తెరచుకోవడమే కాకుండా బ్లాక్ హెడ్స్( Black Heads ) సమస్యను తగ్గిస్తుంది.

అంతేకాకుండా మొటిమల సమస్యలను కూడా నియంత్రిస్తుంది.అలాగే ఇందులో యాంటీ ఇన్‏ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే చర్మం పీహెచ్ స్థాయి సాధారణంగా 4.5 నుంచి 5.5 మధ్య ఉంటుంది.ఇది చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది.

అలాగే చర్మాన్ని బ్యాక్టీరియా, కాలుష్యం నుంచి రక్షిస్తుంది.అంతేకాకుండా చర్మంలోని సహజ నూనెల కారణంగా మొటిమలు ఏర్పడతాయి.

Telugu Soda, Soda Face, Black Heads, Exfoliate, Tips, Healthy Skin, Neutralizer,

బేకింగ్ సోడాను ముఖానికి ఉపయోగించేటప్పుడు ఇది న్యూట్రలైజర్ గా( Neutralizer ) పని చేస్తుంది.బేకింగ్ సోడాను ఒక గిన్నెలో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకొని, కాసిన్ని నీళ్లు కలిపి పేస్టు లాగా చేసుకోవాలి.ఆ తర్వాత దానిని చర్మంపై ఉన్న మచ్చలు, గుర్తులపై రాయాలి.అయితే ఈ మిశ్రమాన్ని ముఖంపై ఎప్పుడైనా ఫేస్ మాస్క్ మాదిరిగా ఆపై చేయకూడదు.మచ్చలపై బేకింగ్ సోడాను అప్లై చేసి పదినిమిషాల 10 నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేయాలి.

దీనిని ఎక్కువగా చేస్తే చర్మం పొడిగా మారిపోతుంది.అలాగే జిడ్డు చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు బేకింగ్ సోడా ను ఉపయోగించకూడదు.

దీనిని ఎక్కువ మోతాదులో కూడా ఉపయోగించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube