అక్షయ తృతీయ( Akshaya Tritiya ) అంటే శ్రీ మహా విష్ణువు.అత్యంత ప్రీతికరమైన రోజు.శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి పరిణయం ఆడిన రోజు.అలాగే భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించే రోజు.అయితే ప్రహ్లాదుడికి నరసింహుడు దర్శనం ఇచ్చిన రోజు కూడా.అలాగే పరమశివుడు సంపదలకు అధిపతిగా కుబేరుడుని నియమించిన రోజు.
అంతేకాకుండా కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేసే రోజు.అక్షయ తృతీయ అనంత సంపదలను ఇచ్చే రోజు అని అందరూ చాలా విశిష్టంగా అక్షయ తృతీయను భావిస్తారు.

అక్షయం అంటే క్షయం కానిది.తరిగిపోనిది.కాబట్టి అలాంటి అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు.ఆరోజు చేసే ఎలాంటి పుణ్యమైన అది అనంత ఫలితాలను ఇస్తుందని అందరూ నమ్ముతారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు.అయితే చాలామంది అక్షయ తృతీయ రోజు మంచి జరగాలంటే, ఐశ్వర్యం రావాలంటే బంగారు కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటారు.

అయితే అక్షయ తృతీయ రోజు మంచి ఫలితం కావాలి అనుకుంటే బంగారం కొనాల్సిన అవసరం లేదు అని జ్యోతిష్య శాస్త్రాన్ని చెబుతున్నారు.అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.దానం చేయాలనుకున్నవారు వారు అన్నదానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం ఇలా ఏది చేసినా కూడా మంచి జరుగుతుంది.అలాగే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

అక్షయ తృతీయ రోజు దానాలు చేయలేని వారు మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి.అంతేకాకుండా కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవికి పూజ(Lakshmi Puja ) చేస్తూ ఉండాలి.ఇలా చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
అక్షయ తృతీయ నాడు పర్వదినాన గణపతిని ఆరాధించడం కూడా చాలా మేలు చేస్తుంది.శ్రీమహావిష్ణువు( Sri Maha vishnu )ను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు కూడా తొలగిపోతాయి.