ఖర మాసం( Khara month ) హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి నెల 15వ తేదీన ఉదయం 5:17 నిమిషములకు మొదలైంది.ఈ సమయంలో సూర్యుడు మీనరాశిలోకి సంచరించాడు.
ఖర మాసం ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉంటుంది.ఈ సమయంలో అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండడమే మంచిది.
ఎందుకంటే ఖర మాసంలో సూర్యుడు మీనం లేదా ధనస్సు రాశిలో ఉన్నప్పుడు శుభ రాశుల మీద, యోగం మీద, శుభకార్యాల పై అశుభ ప్రభావం ఉంటుంది.పెళ్లి ముహూర్తం లాంటి ముఖ్యమైన పనులు కూడా ఈ మాసంలో చేయకూడదు.
ఇలా చేయడం వల్ల కొత్తగా పెళ్లయిన జంట జీవితంలో కష్టాలు మొదలవుతాయి.అంతే కాకుండా కొత్త వాహనం, ఇల్లు లేదా మరేదైనా ఆస్తిని ఖర మాసంలో కొనకూడదు.
మీరు కొత్త ఉద్యోగం గురించి ఆలోచిస్తుంటే ఈ మాసంలో ట్రై చేయకపోవడమే మంచిది.లేకపోతే రానున్న రోజులలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఖర మాసంలో శుభకార్యాలు జరగవు.గృహప్రవేశం, ఉపనయనం, ముండనం, నిశ్చితార్థం కూడా చేయకూడదు.వాటి కోసం ఖర మాసం ముగిసిన తర్వాత సమయాన్ని తీసుకోవడమే మంచిది.ఈ మాసంలో భగవంతుని పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.ఈ సమయంలో సూర్య భగవానుడిని( Lord Surya ) ఎక్కువగా పూజిస్తూ ఉంటారు.దీని వల్ల అదృష్టాన్ని మరియు సంపాదనను పొందవచ్చు.
ఈ మాసంలో ఉదయాన్నే సూర్య భగవంతునికి అర్ఘ్యం సమర్పించాలి.కుంకుడు, పసుపు పువ్వులు, అక్షతాలను సమర్పించాలి.
ఖర మాసంలో శ్రీ మహావిష్ణువు( Shri Mahavishnu ) పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.తులసిని పూజించడం వలన ఐశ్వర్యం, ధన ధాన్యాలు, ఆరోగ్యం లభిస్తాయి అని పెద్దవారు చెబుతూ ఉంటారు.
శుభకార్యాలకు మే నెల రెండవ తేదీ నుంచి మంచి రోజులు ఉన్నాయని ఈ పండితులు చెబుతున్నారు.ఎందుకంటే ఏప్రిల్ 29 వరకు బృహస్పతి అస్తమిస్తుంది.
బృహస్పతి బాల్య దోషం మూడు రోజులు ఉంటుంది.అందుకే మే రెండు నుంచి అన్ని శుభకార్యాలు మొదలవుతాయి.