మన దేశంలో అనేక అమ్మవారి పుణ్యక్షేత్రాలు, దుర్గాదేవి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.ఇవి ప్రజల విశ్వాసానికి కేంద్రాలుగా భావిస్తారు.
లయకారుడు మహాదేవుని దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే రావణుడు శివునికి గొప్ప భక్తుడు.
మహాదేవుని నుంచి వరం పొందేందుకు రావణాసుడు అనేకసార్లు కఠోర తపస్సు చేశాడని పండితులు చెబుతున్నారు.లంక రాజు రావణుడు శివుడిని ఆరాధించిన శివాలయం ఎక్కడ ఉంది? దీని వెనుక ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయపూర్ సమీపంలోని అవర్‌ఘర్ కొండల పై ఉన్న కమల్‌నాథుడి దేవాలయాన్ని( Kamalnath Temple Udaipur ) లంకాపతి రావణుడు స్వయంగా స్థాపించాడని పండితులు చెబుతున్నారు.

ఒకసారి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు( Ravanasura ) కైలాస పర్వతం పై కఠోర తపస్సు చేసి, శివయ్య ఆత్మ లింగాన్ని తీసుకొని లంకకు వెళ్లే వరం పొందాడు.అయితే ఆ సమయంలో ఆ శివలింగాన్ని నేలపై ఎక్కడ ఉంచరాదనే ఒక షరతు ఉంది.దీంతో రావణాసురుడు ఆత్మ శివలింగాన్ని( Shivalingam ) తీసుకొని వెళ్తున్న రావణుడు అలసిపోయి శివలింగాన్ని ఒక ప్రదేశంలో ఉంచి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత శివలింగాన్ని తీసుకొని వెళ్లడం కోసం శివలింగాన్ని చేతిలోకి తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా శివలింగం రాలేదు.అప్పుడు రావణుడు తన తప్పును గ్రహించి అక్కడ ఉన్న శివయ్యను రావణుడు ప్రతిరోజు పూజించడం మొదలు పెట్టాడు.

రోజు 100 కమలాలను సమర్పించేవాడు.ఇలా శివయ్యను మళ్ళీ తన లంకకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నం అనేక సంవత్సరాలు చేశాడు.అయితే అతని తపస్సు ఫలించబోతుండగా ఒక రోజు బ్రహ్మదేవుడు తన 100 తామర పువ్వుల నుంచి ఒక పువ్వును తగ్గించాడని పురాణాలలో ఉంది.అలా 100 తామర పువ్వుల్లో ఒక పువ్వు తగ్గినందున రావణుడు పూజలో వందవ పువ్వు స్థానంలో తన తలను సమర్పించాడు.
రావణాసుడి భక్తికి సంతోషించిన మహాదేవుడు రావణాసుడి నాబిలో అమృత కుండని వరంగా ఇచ్చాడు.అలాగే శ్రీలంకలోని త్రికోణమాలి అనే ప్రదేశంలో శంకరీ దేవి దేవాలయం( Shankaridevi Shaktipeetham ) ఉంది.
ఈ దేవాలయాన్ని శక్తి పీఠంగా పరిగణిస్తారు.హిందూ విశ్వాసాల ప్రకారం సతీదేవి చీలమండలు అంటే కాళీ గజ్జలు ఈ ప్రదేశంలో పడ్డాయని ప్రజలు నమ్ముతున్నారు.
రావణుడు స్వయంగా ఈ దేవాలయంలో ఈ దేవతను ప్రతిష్టించాడని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL