ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం.5.45
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది.
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడతారు.సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు.బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు.
వృషభం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది.
మిథునం:

ఈరోజు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.చిన్న చిన్న విషయాలను సాగదీయకపోవడం మంచిది.
ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.మీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు
కర్కాటకం:

ఈరోజు మీరు చేపట్టే పనులలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.అనుకోకుండా కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
సింహం:

ఈరోజు ఓ శుభవార్త వింటారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు.
కన్య:

ఈరోజు మీరు ఇతరుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థిక లాభాలు కలుగుతాయి.
వ్యాపారాలు చేపడతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు
తుల:

ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారస్థులకు మంచి లాభాలు ఉంటాయి.మీరంటే గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చికం:

ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు.
ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.
ధనుస్సు:

ఈరోజు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకెళితే విజయం సాధిస్తారు.ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకరం:

ఈరోజు మీ దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
DEVOTIONAL