టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ వద్దకు ఉన్నటువంటి మంచు మనోజ్ (Manoj)ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకుని తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.తన మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత మనోజ్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నటువంటి మనోజ్ భూమా మౌనిక (Bhuma Mounika) ప్రేమలో పడ్డారు అప్పటికే ఆమెకు కూడా పెళ్లి జరిగి ఒక బాబు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నారు.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ ఈ ఏడాది మార్చి మూడవ తేదీ వివాహం చేసుకున్నారు.
మంచు లక్ష్మి సమక్షంలో తన నివాసంలోనే అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.ఇలా పెళ్లి తర్వాత వీరిద్దరు కూడా వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
అయితే మౌనిక రెడ్డి ఇప్పటికే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి బిసినెస్ ఉమెన్ గా కొనసాగుతూ ఉండగా మనోజ్ కూడా తన కెరియర్ పై ఎంతో బిజీ అవుతున్నారు.ఇలా ఈయన పలు సినిమాలను ప్రకటించడమే కాకుండా మరోవైపు ఉస్తాద్ అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే మనోజ్ మరోసారి తండ్రి కాబోతున్నారు అనే విషయం మనకు తెలిసిందే.భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత తన కొడుకుని కూడా తన కొడుకు గానే భావించి ఆ బాబు బాధ్యతను మొత్తం మనోజ్ తీసుకున్నారు.అయితే మరోసారి మౌనిక తల్లి కాబోతున్నటువంటి విషయాన్ని మనోజ్ వెల్లడించారు.తన అత్తమ్మ శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.అయితే తాజాగా మరోసారి ఈయన మౌనిక ప్రెగ్నెన్సీ (Pregnancy)గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం మౌనిక ఐదవ నెల ప్రెగ్నెన్సీ తో ఉందని, తాను తమ రెండో బేబీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







