అసలు భగవంతుని దగ్గర దీపం ఎందుకు వెలిగించాలి? భగవంతుని దగ్గర దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు.అది శుభమా? అ శుభమా అలా జరిగితే దేనికి సంకేతం అని చాలామంది భక్తులు ఆలోచిస్తూ ఉంటారు.ఇంతకీ దీపం ఆరిపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ ధర్మం( Hindu Dharma )లో ప్రతిరోజు చాలామంది ప్రజలు పూజలు చేస్తూ ఉంటారు.పూజ చేసే ముందు దీపం వెలిగిస్తూ ఉంటారు.ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ ఉంది.
ఇంటి ప్రధాన ద్వారం ముందు, తులసి మొక్క ముందు ప్రతిరోజు దీపం వెలిగిస్తారు.ఒక్కో సమయంలో పూజ చేస్తుండగా దీపం ఆకస్మాత్తుగా ఆరిపోనట్లు అయితే అది అపశకునంగా భావిస్తారు.

పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే అది దేనిని సూచిస్తుంది.అసలు ఆరిపోవడం అనే పదం వినియోగించడమే అపచారం అని కొండెక్కిందని, ఘనమైందని చెబుతూ ఉంటారు.దీపం వెలిగించడం వల్ల జీవితంలోని చీకటి తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి దూరమైపోతుందని పండితులు చెబుతున్నారు.
చీకటిలో దీపం మనకు ఒక దారి చూపించి ధైర్యాన్ని ఇస్తుంది.శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు దూరమైపోతాయి.దీపం అంటే జ్ఞానం అని కూడా అర్థం వస్తుంది.దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకటిని దూరం చేస్తుంది.
అందుకే మనలోని అపోహ,అహన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి.

అలాగే దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు( Vastu Doshas ) తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే దీపం ఎప్పుడు కూడా పైకి వెలుగుతూ ఉంటుంది.పవిత్రంగా పైకి ఎగసే ఆ జ్ఞానపు వెలుగును స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీపం యొక్క పరమార్థం అని పండితులు( Scholars ) చెబుతున్నారు.
పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే పూర్తి పుణ్యఫలం లభించదు.అంతేకాకుండా దేవుని ముందు మీరు కోరిన కోరిక నెరవేరదని అర్థం చేసుకోవచ్చు.అలాగే మనిషి పవిత్రమైన మనసుతో భగవంతుడిని పూజించకపోయినా దేవుని దీపం కొండెక్కిపోతుందంటారు.పూజ చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ఆరిపోతే దేవునికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించాలి.
దీపంలో తగినంత నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి.
TELUGU BHAKTHI