మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు వెళ్లి భగవంతునికి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
ఇంకా కొన్ని దేవాలయాలు నిర్మాణ దశలో కూడా ఉన్నాయి.మరి కొన్ని ప్రాంతాలలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠ పనలు కూడా జరుగుతూ ఉన్నాయి.
అందులో భాగంగానే తాజాగా మండల కేంద్రం తానూర్‌లో గురువారం శ్రీ సాయిబాబా విగ్రహ దేవాలయ శిఖర స్థాపన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
అయితే మహారాష్ట్ర లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ నుంచి తీసుకొచ్చిన సాయి బాబా విగ్రహానికి, శిఖరానికి వేద పండితులు బబ్రు మహారాజ్, సచిన్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పుణ్య కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు తీర్చుకున్నారు.ఆ తర్వాత సాయిబాబా విగ్రహానికి అభిషేకం, అలంకరణ, మహా హారతి ఇచ్చారు.ఆ తర్వాత దేవాలయం బై శిఖర స్థాపన నిర్వహించారు.
ఇంకా చెప్పాలంటే విగ్రహ ప్రతిష్ఠ పనకు వచ్చిన భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు.ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేవార్ విఠల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరావు పటేల్, డైరెక్టర్ గోవింద్ రావు పటేల్, మాజీ సర్పంచ్ చంద్రకాంత్, నాయకులు మాధవరావు పటేల్, ఎస్సై విక్రమ్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఈ పుణ్య కార్యక్రమానికి హాజరయ్యారు.