ఇంటికి వాస్తు ప్రకారం ఎన్ని ద్వారాలు ఉండాలో తెలుసా..?

వాస్తు శాస్త్రంలో( Vastu ) ఇంటి ద్వారాలకు ప్రత్యేక స్థానం ఉంది అన్న విషయం దాదాపు చాలామందికి తెలుసు.అయితే వాస్తు శాస్త్రంలో ఇంటికి ఎన్ని ద్వారాలు( Doors ) ఉండాలి అన్న విషయాన్ని కూడా వెల్లడించారు.

 How Many Doors In House According To Vastu Details, Doors , House , Home Doors,-TeluguStop.com

కానీ చాలామంది ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటూ ఉంటారు.కానీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు మాత్రం ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా శుభసంఖ్యలో ద్వారాలు ఉండాలని, శాస్త్రీయ పరంగా ద్వారలకు ఒక విశిష్ట స్థానం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Telugu Doors, Doors Vastu, Happy, Number Doors, Vastu, Vastu Shastram, Vastu Tip

శుభసంఖ్యలో ద్వారాలు ఉండడం వల్ల ఇంట్లో( House ) నివసించే వారికి మంచి ఫలితాలు వస్తాయి.అదే శాస్త్రానికి విరుద్ధంగా ద్వారాలు ఉంటే అశాంతి కలిగించే ఫలితాలు వస్తాయి.మనం నివసించే ఇంటిలో రెండు ద్వారాలు( Two Doors ) ఉంటే ఎంతో మంచిది.రెండు ద్వారాల ఇంటిలో నివసించే వ్యక్తులు శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది.

అదే నాలుగు ద్వారాలు ఉన్న గృహంలో నివసించే వ్యక్తులకు ఆయువు, ఆరోగ్యాలను కలిగి వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది.అంతేకాకుండా సమాజంలో వారి కంటూ ఒక ప్రత్యేక గౌరవం ఏర్పడి మంచి గుర్తింపు లభిస్తుంది.

ఆరు ద్వారాలు ఉన్న ఇల్లు పుత్ర వృద్ధి, శ్రేయస్సు ఐశ్వర్యము కలుగుతుంది.

Telugu Doors, Doors Vastu, Happy, Number Doors, Vastu, Vastu Shastram, Vastu Tip

ఇంకా చెప్పాలంటే ఎనిమిది ద్వారాలు( Eight Doors ) ఉన్న గృహంలో నివసించే వారు సకల భోగభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉంటారు.12 ద్వారములు గల ఇల్లు ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని కలిగించి మంచి కీర్తి ప్రాప్తిస్తుంది.14 ద్వారములు ఉన్న ఇల్లు కుటుంబ వృద్ధి, ధన సంపదను కలిగిస్తుంది.16 ద్వారములు గల ఇల్లు అన్నిటిలో విజయం లభిస్తుంది.ఐదు ద్వారములు ఉన్న ఇల్లు అనారోగ్య సమస్యలను, సంతానానికి కీడును శత్రువుల నుంచి ఇబ్బందులను కలిగిస్తుంది.

ఏడు ద్వారములు ఉన్న ఇల్లు మరణాలకు దారితీస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube