సాధారణంగా చెప్పాలంటే మైండ్స్ గేమ్స్( Mind games ) ఆడటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అని కచ్చితంగా చెప్పవచ్చు.కొందరికి మాత్రమే అటువంటి పనులు సాధ్యమవుతాయి.
మైండ్ గేమ్స్ ఆడేవారు ఎప్పుడు కూడా ఎదుటివారి కంటే ఆలోచనలో చాలా ముందు ఉంటారు.కొందరు మైండ్ గేమ్స్ మంచికి ఉపయోగిస్తే మరి కొందరేమో అవతలి వారిని రెచ్చగొట్టేందుకు ఉపయోగిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ( Astrology )ప్రకారం కొన్ని రాశుల వారు మైండ్ గేమ్స్ ఆడడంలో ముందుంటారు.వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి( Taurus ) వారు నమ్మించడంలో ముందుంటారు.వారు చెప్పింది నిజం అన్నట్లు ఎదుటివారిని నమ్మేలా చేస్తారు.
ఇందుకోసం వీరు మైండ్ గేమ్స్ ఆడుతారు.

అప్పటి వరకు జరిగిన విషయాలను ఒక వరుస క్రమంలో చెబుతూ ఈ కారణం వల్ల ఇది జరిగింది అని నమ్మిస్తారు.ఆ తర్వాత తమ పనులను పూర్తి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.ఇంకా చెప్పాలంటే మైండ్ గేమ్స్ ఆడడంలో మేషరాశి వారు ( Aries )కూడా ముందు ఉంటారు.వీరు తమ పనులతో, తమ మాటలతో ఇతరులను తమ దారిలోకి తెచ్చుకుంటారు.
ఇందుకోసం వీరు మైండ్ గేమ్స్ ఆడుతారు.ఈ రాశి వారు ఏం చెప్పినా చేసేందుకు ఇతరులు రెడీ అయి పోతారు.
మైండ్ గేమ్స్ ఆడుతున్నట్లు ఎదుటివారికి అస్సలు అనుమానం కూడా రాదు.

ఇంకా చెప్పాలంటే కన్యా రాశి( Virgo ) వారు కూడా అచ్చం కర్కటక రాశి వారిలానే ఉంటారు.వీరు తమ మైండ్ గేమ్స్ తో ఎదుటి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసేలా వీరి పనులు ఉంటాయి.తియ్యగా మాట్లాడుతూనే మనల్ని తప్పుదారి పట్టించడంలో ఈ రాశి వారు ముందు ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే మైండ్ గేమ్స్ లో కర్కాటక రాశి( Cancer sign ) వారిది ప్రత్యేక శైలి అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
వీరు మైండ్ గేమ్స్ ద్వారా ఆలోచనలను తారు మారు చేస్తారు.వాస్తవంగా ఒకటి జరిగితే దాన్ని కాకుండా జరగని విషయాన్ని, జరిగిన విషయంలా చెప్పి ఎదుటివారిని ఈ రాశి వారు నమ్మిస్తారు.