సాధారణంగా చెప్పాలంటే నక్షత్రాలను బట్టి జాతకంలోని గ్రహాల స్థితి గతులను బట్టి వివాహ సంబంధామైన పొంతనలను చూడడం జరుగుతూ ఉంటుంది.అయితే కొద్ది కాలం క్రితం వరకు కోణాలను బట్టి, కేంద్రాలను బట్టి పొంతనలను చూడడం జరుగుతూ ఉండేది.
కానీ ఇప్పటికీ కూడా దేశలలోని అనేక ప్రాంతాలలో ఈ విధంగానే పొంతనలను చూడడం జరుగుతూ ఉంది.జ్యోతిష శాస్త్రం( Astrology ) ప్రకారం కోణం అంటే చంద్రుడు ఉన్న రాశికి ఒకటి, ఐదు, తొమ్మిది స్థానాలు.
కేంద్ర స్థానాలంటే ఒకటి, నాలుగు, పది స్థానాలు.మీ రాశి మేషం అయ్యే పక్షంలో మీకు సింహం, ధను రాశి వారితో పొంతన బాగా కుదురుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే మేషం, సింహం, ధనస్సు రాశుల వారి మధ్య వివాహ సంబంధం కుదిరితే స్వార్థం లేని దంపత్య జీవితం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.ఒకరి కోసం ఒకరు ఉన్నట్లుగా ఈ రాశుల వారు జీవిస్తారు.
సాధారణంగా ఇది దైవం కుదిరించిన సంబంధం గా చెప్పవచ్చు.

దాంపత్య జీవితం లేదా వివాహాల బంధం ఎక్కువ కాలం కొనసాగడానికి, సుఖసంతోషాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే మేషం,కర్కాటకం, మకరం రాశుల కేంద్ర రాశుల విషయానికి వచ్చేసరికి మేష రాశి ( Aries )వారికి కర్కాటకం లేదా మకర రాశి తో వివాహ పొంతన సుఖప్రదంగా ఉంటుంది.సాధారణంగా కేంద్ర రాశుల మధ్య వివాహ పొంతన పరస్పర ఆధార సంబంధం గా కొనసాగుతుంది.

వృషభం, కన్య, మకరం( Taurus, Virgo, Capricorn ) రాశులు ఒకదానికి ఒకటి కోణ రాశుల్లో ఉన్నందువల్ల సాధారణంగా ఈ రాశుల వారి మధ్య వివాహ బంధం పటిష్టంగా ప్రశాంతంగా కొనసాగడానికి అవకాశం ఉంది.వీరి మనస్తత్వం చాలా వరకు దగ్గరగా ఉంటుంది.మిథునం, కుంభం,తుల రాశుల వివాహ బంధాలు కూడా పటిష్టంగా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే మిథునం, కన్య, మీనం రాశుల వివాహ బంధాలు కూడా ఎంతో బలంగా ఉంటాయి.
ఈ రాశుల దంపతులు ఎక్కువగా సర్దుకుపోతూ ఉంటారు.