నేడు తాజాగా టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్( Gujarat Titans, ), సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ తో ప్లే ఆఫ్ సస్పెన్స్ దాదాపుగా వీడనుంది.
హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ చేయాలంటే ఈ మ్యాచ్ కీలకం.ఆడిన 11 మ్యాచ్లలో 4 మ్యాచ్ లలో గెలిచి 8 పాయింట్లతో లీగ్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది.హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోతుంది.
చేతిలోకి వచ్చిన ఎన్నో మ్యాచ్లను హైదరాబాద్ జట్టు చేతులారా జారవిడుచుకుంది.ప్రస్తుతం 9 వ స్థానంలో కొనసాగుతోంది.
లీగ్ పాయింట్ లో పట్టికలో 4 స్థానంలో ఉన్న లక్నో జట్టు నుంచి 8 స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు వరకు ఉన్న ఐదు జట్లు 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి రన్ రేట్ కారణంగా వివిధ స్థానాలలో నిలిచాయి.కాబట్టి ఈ జట్లు ప్రతి మ్యాచ్లో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ చాన్సులు సజీవంగా ఉంటాయి.

అయితే నాలుగో స్థానంలో ఉన్న లక్నో జట్టుకు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి ఒక పాయింట్ అదనంగా రావడంతో కాస్త అడ్వాంటేజ్ లభించింది. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్( Punjab Kings ) ఆశలను సజీవం చేసుకోవడం కోసం కీలక మ్యాచ్లో ఢిల్లీ పై 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజాగా కలకత్తా జట్టు కూడా ప్లే ఆఫ్ కు చేరెందుకు కీలకమైన మ్యాచ్లో చెన్నై జట్టును చిత్తు చేసి, విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కోసం( Royal Challengers Bangalore ) కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ని 59 పరుగులకే అల్ అవుట్ చేసి, 112 పరుగుల తేడాతో రన్ రేట్ భారీగా పెంచుకొని ఐదవ స్థానానికి దూసుకు వెళ్ళింది.బెంగుళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.ఈ నాలుగు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం కీలక మ్యాచ్లలో విధ్వంసం సృష్టించి విజయం సాధించడంతో ఈ సీజన్లో ప్లే ఆఫ్ కు చేరే జట్ల విషయంలో సస్పెన్స్ విడాలంటే లీగ్ లో ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.
కానీ తాజాగా గుజరాత్ – హైదరాబాద్ ( Sunrisers Hyderabad )మధ్య జరిగే మ్యాచ్ తో సస్పెన్స్ కాస్త తగ్గే అవకాశం ఉంది.ఎలా అంటే గుజరాత్ జట్టు విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్ కు చేరుతుంది.
హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అవుతుంది.అలా కాకుండా హైదరాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరే జట్ల విషయంలో ఉత్కంఠ నెలకొంటుంది.