షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు కొత్తిమీర‌తో ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

కొత్తిమీర ( Coriander )గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.ఎక్కువ శాతం మందికి ఆదివారం మాత్రమే కొత్తిమీర గుర్తుకు వస్తుంది.

 From Sugar Control To Weight Loss, Are There So Many Benefits Of Coriander? Cori-TeluguStop.com

కొత్తిమీర లేనిదే నాన్ వెజ్ వంటలు అసంపూర్ణం.చికెన్, ఫిష్, మటన్ ఇలా ఏ నాన్ వెజ్ వంటకానికైనా కొత్తిమీర అదనపు రుచి ఫ్లేవర్ ను అందిస్తుంది.

అలాగే వెజ్ ఐటమ్స్ లో కూడా కొత్తిమీరను విరివిరిగా వాడుతుంటారు.అయితే కొత్తిమీర ఆహారం యొక్క రుచిని పెంచడానికి మాత్రమే సహాయపడుతుంది అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి, డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి.

Telugu Coriander, Tips, Latest, Sugar Control-Telugu Health

అందువల్ల ఆరోగ్యానికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా కొత్తిమీర వారానికి రెండు సార్లు ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర ఆకులు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు( Fennel ) వేసి మరిగించాలి.

దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేసిన తర్వాత స్టవ్‌ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.</br

Telugu Coriander, Tips, Latest, Sugar Control-Telugu Health

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం( Lemon Juice ) కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ డ్రింక్ ను మీరు రోజు తీసుకోవచ్చు.లేదా వారానికి కనీసం రెండు సార్లు తీసుకోవడానికి అయినా ప్రయత్నించండి.

కొత్తిమీర తో తయారు చేసిన ఈ పానీయం లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి, ఇవి ఆహారం ద్వారా వచ్చే వ్యాధి కారక క్రిములకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.అలాగే మధుమేహం ఉన్నవారు ఈ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.

వెయిట్ లాస్ అవుతారు.అధిక బరువు సమస్య నుంచి బయట పడతారు.

అంతేకాదు ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతుంది.మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కు చెక్ పెడుతుంది.ఆరోగ్యకరమైన దృష్టిని ప్రోత్సహిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.మెదడులోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు జ్ఞాపకశక్తిని సైతం మెరుగుపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube