ఇదేం విచిత్రం.. 32 పళ్లతో పుట్టిన బిడ్డ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు??

సాధారణంగా పిల్లలు పళ్లు లేకుండానే పుడతారు కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు 32 పళ్లతో( 32 Teeth ) ఓ బిడ్డ పుట్టింది.దాంతో డాక్టర్లతో పాటు తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు.

 American Mother Gave Birth To A Baby Born With 32 Teeth Details, Children, Teeth-TeluguStop.com

ఈ చిన్నారి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ బిడ్డ 32 పళ్లతో నవ్వడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఇది చాలా అరుదైన సంఘటన అని వైద్యులు చెబుతున్నారు.దీనిని నియోనాటల్ టీత్ లేదా నేటల్ దంతాలు( Natal Teeth ) అంటారు.

అమెరికా దేశం,( America ) టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్‌కు చెందిన నికా దివా( Nika Diwa ) అనే మహిళకు ఈ ఆడబిడ్డ( Baby Girl ) పుట్టింది.ఆమె ఈ అరుదైన పరిస్థితి గురించి అవగాహన కల్పించేందుకు టిక్‌టాక్ వేదికగా ఒక వీడియో షేర్ చేసింది.

తనకు పుట్టిన బిడ్డకు పూర్తిగా అన్ని పళ్లు ఉన్నాయని చెప్పింది.

నికా దివా ఈ చిన్నారి నోటిలోని దంతాలు చూసి ఆశ్చర్యపోయింది.ఇది చాలా అరుదైన వ్యాధి అని వైద్యులు తనకు తెలియజేసినట్లు పేర్కొంది.ఈ పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకొని దీని పట్ల అవగాహన పెంచుకోవాల్సిందిగా ఆమె కోరింది.

@ika.diwa అనే ఇన్‌స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ వచ్చాయి.

జనెటిక్స్‌, కొన్ని వైద్య పరిస్థితులు లేదా గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యాలు ఈ పరిస్థితికి కారణమవుతాయి.ఈ పరిస్థితి బిడ్డకు చాలా హాని కలిగించే ప్రమాదం ఉంది.దంతాలు ఊడిపోతే వాటిని బిడ్డ మింగవచ్చు.దంతాలు గొంతు, కడుపులో పడే ప్రమాదం ఉంది.అంతేకాదు తల్లి పాలివ్వడంలోనూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందుకే ఈ పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube