ఇదేం విచిత్రం.. 32 పళ్లతో పుట్టిన బిడ్డ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు??

సాధారణంగా పిల్లలు పళ్లు లేకుండానే పుడతారు కానీ అమెరికాకు చెందిన ఓ మహిళకు 32 పళ్లతో( 32 Teeth ) ఓ బిడ్డ పుట్టింది.

దాంతో డాక్టర్లతో పాటు తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు.ఈ చిన్నారి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ బిడ్డ 32 పళ్లతో నవ్వడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఇది చాలా అరుదైన సంఘటన అని వైద్యులు చెబుతున్నారు.

దీనిని నియోనాటల్ టీత్ లేదా నేటల్ దంతాలు( Natal Teeth ) అంటారు.

అమెరికా దేశం,( America ) టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్‌కు చెందిన నికా దివా( Nika Diwa ) అనే మహిళకు ఈ ఆడబిడ్డ( Baby Girl ) పుట్టింది.

ఆమె ఈ అరుదైన పరిస్థితి గురించి అవగాహన కల్పించేందుకు టిక్‌టాక్ వేదికగా ఒక వీడియో షేర్ చేసింది.

తనకు పుట్టిన బిడ్డకు పూర్తిగా అన్ని పళ్లు ఉన్నాయని చెప్పింది. """/" / నికా దివా ఈ చిన్నారి నోటిలోని దంతాలు చూసి ఆశ్చర్యపోయింది.

ఇది చాలా అరుదైన వ్యాధి అని వైద్యులు తనకు తెలియజేసినట్లు పేర్కొంది.ఈ పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకొని దీని పట్ల అవగాహన పెంచుకోవాల్సిందిగా ఆమె కోరింది.

@ika.diwa అనే ఇన్‌స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియోకు ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ వచ్చాయి.

"""/" / జనెటిక్స్‌, కొన్ని వైద్య పరిస్థితులు లేదా గర్భధారణ సమయంలో తల్లి అనారోగ్యాలు ఈ పరిస్థితికి కారణమవుతాయి.

ఈ పరిస్థితి బిడ్డకు చాలా హాని కలిగించే ప్రమాదం ఉంది.దంతాలు ఊడిపోతే వాటిని బిడ్డ మింగవచ్చు.

దంతాలు గొంతు, కడుపులో పడే ప్రమాదం ఉంది.అంతేకాదు తల్లి పాలివ్వడంలోనూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

అందుకే ఈ పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

ఈ హీరోయిన్స్ అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారా..??