ప్యాసింజర్ల మీద అరిచిన యూఎస్ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది.. క్షమాపణలు చెప్పిన కంపెనీ..

సాధారణంగా ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేసుకోవడం, ఎయిర్ పోర్ట్‌కి చేరుకోవడం సమయం, శ్రమతో కూడుకున్న పని.ఇంత శ్రమ తీసుకున్నా కొన్ని ఫ్లైట్స్‌ చాలా ఆలస్యంగా వచ్చి చిరాకు పుట్టిస్తాయి.

 Us Airline Gate Staff Yells At Passengers Company Apologises Video Viral Details-TeluguStop.com

అయితే ఇటీవల ఒక యూఎస్ ఫ్లైట్ ఎనిమిది గంటల ఆలస్యమైనట్లు తెలిసి ప్యాసింజర్లు చాలా బాధపడ్డారు.అయితే ఆ విమాన సిబ్బంది( Flight Staff ) బాధపడుతున్న ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడకుండా, వారిని బెదిరించి, ఇష్టం వచ్చినట్లు వారిపై అరిచేశారు.

అమెరికాలోని స్పిరిట్ ఎయర్‌లైన్స్‌కు( Spirit Airlines ) చెందిన సిబ్బంది ఇలాంటి దుష్ప్రవర్తనతో షాకిచ్చారు.ఈ ఘటన హాలీవుడ్ బర్బ్యాంక్ విమానాశ్రయంలో జరిగింది.దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక విమానం ఆలస్యం కావడం, మరొక విమానాన్ని ఎక్కాల్సిన ప్రయాణికులు( Passengers ) గందరగోళం సృష్టించడం వల్ల ఈ గొడవ జరిగింది.

ప్రయాణికులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న ఒక స్టాఫ్ మెంబర్ ఇంటర్‌కామ్‌ ద్వారా, “ఏం జరుగుతుందో అర్థం కావడానికి నాకు కొంచెం సమయం ఇవ్వండి.ఎవరు ఏ విమానంలో వెళ్లాల్సి ఉందో నాకు తెలియడం లేదు.నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి.” అని అరిచింది.

మరో లేడీ ఆఫీసర్( Lady Officer ) కోపంతో ప్రయాణికులపై అరిచింది.“మీరు ఈ విమానంలో ప్రయాణించాలా వద్దా?” అని అడిగింది.“అవును, మేం వెళ్ళాలి” అని ఓ ప్రయాణికుడు అన్నాడు.దానికి ఆమె “సరే! ఎవ్రీబడీ షటప్! మేం ఒక్కసారే చెప్తాము.

మేం కూడా చాలా కోపంగా ఉన్నాము” అని అరిచింది.

ఈ ఘటనను రికార్డు చేస్తున్న ప్రయాణికుడు కెవిన్ ఐస్, ఆ లేడీ ఆఫీసర్ తనను విమానం నుంచి దించివేస్తానని బెదిరించినట్లు వీడియోలో చూపించాడు.“ఇది నాకు ఎదురైన అత్యంత చేదైన అనుభవం” అని ఆయన చెప్పాడు.సదరు లేడీ ఆఫీసర్ మొదట ప్రయాణికులను సహాయం చేయడానికి, వారిని శాంతపరచడానికి ట్రై చేసింది కానీ తర్వాత ఆమె కోపంగా మారిందని ఆయన వివరించారు.

స్పిరిట్ ఎయర్‌లైన్స్ ఈ ఘటనకు క్షమాపణలు తెలిపింది.“ప్యాసింజర్లకు కలిగిన ఇబ్బందికి మేం క్షమాపణ చెబుతున్నాం.ఇది మా అధిక ప్రమాణాలకు అనుగుణంగా లేదు” అని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ ఘటనలో పాల్గొన్న ఇద్దరు లేడీ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు ది న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube