ఎన్టీఆర్ తో సినిమా గురించి బామ్మర్ది షాకింగ్ కామెంట్స్.. ఆయన ముందు నేనెంతంటూ?

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్( Narne Nithin ) గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే నితిన్ మ్యాడ్ మూవీతో( Mad Movie ) హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని కూడా అందుకున్నారు.

 Narne Nithin Shocking Comments On Jr Ntr Details, Narne Nithin, Narne Nithin Sho-TeluguStop.com

మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో నితిన్ పేరు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారు మోగింది.అయితే నిజానికి మ్యాడ్ కంటే ముందు నార్నె నితిన్ రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు.

అయితే అవి మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.మ్యాడ్ మాత్రం నార్నె నితిన్ కి గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది.

దీని తర్వాత ఆయ్ సినిమాతో( Aay Movie ) ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రావడానికి నార్నె నితిన్ సిద్ధం అవుతున్నాడు.

Telugu Aay, Jr Ntr, Jrntr, Mad, Narne Nithin, Ntr Brother Law, Tollywood-Movie

గోదావరి బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా మీట్ నిర్వహించింది.ఈ సందర్భంగా జర్నలిస్టులతో సినిమా విశేషాలని చిత్ర యూనిట్ పంచుకున్నారు.

ఆయ్ మూవీలో నార్నె నితిన్ కి మంచి కామెడీ పండించే క్యారెక్టర్ దొరికినట్లు తెలుస్తోంది.ఈ సినిమా సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకులకి చేరువ అయ్యాయి.

ఇదిలా ఉంటే మీడియా మీట్ లో నార్నె నితిన్ ని ఉద్దేశించి జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగారు.

Telugu Aay, Jr Ntr, Jrntr, Mad, Narne Nithin, Ntr Brother Law, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ తో( Jr NTR ) కలిసి మీరు ఎప్పుడు సినిమా చేస్తారని ప్రశ్నించగా.జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకుంటే నా స్థాయి చాలా చిన్నదని నార్నె నితిన్ చెప్పుకొచ్చాడు.దేవర సినిమాలో రీసెంట్ గా వచ్చిన సాంగ్ లో దేవర ముందు నువ్వెంత అనే లైన్ ని గుర్తుచేశారు.

ఆయన ముందు నేను చాలా తక్కువ అని చెప్పుకొచ్చాడు నితిన్.అలాగే మీ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉంటాయని, డాన్స్ ఎన్టీఆర్ తరహాలో ఉంటుందని సదరు జర్నలిస్ట్ నార్నె నితిన్ కి తెలియజేశారు.

ఈ అభినందనపై నితిన్ థాంక్యూ చెప్పాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube