కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రం ను సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రజల సౌకర్యార్ధం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి,పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ పట్టణాలతో పాటు, అన్ని మండల కేంద్రాల లోని ఎం.పీ.డీ.ఓ.కార్యాలయాలలో ప్రజా పాలన సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అన్నారు.వివిధ పనుల నిమిత్తం, సమస్యలు విన్నవిస్తూ అర్జీలు సమర్పించేందుకు అనునిత్యం ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్)కు వచ్చే వారికి సైతం ప్రజాపాలన సేవా కేంద్రం అందుబాటులో ఉండాలని భావించి దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 District Collector Visited The Prajapalana Seva Kendra Set Up In The Collectorat-TeluguStop.com

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల లోని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పలు కారణాల వల్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందలేక పోతున్న అర్హులైన దరఖాస్తుదారులు, ప్రజాపాలన సేవా కేంద్రాలను సందర్శించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేయించుకోవచ్చని సూచించారు.కలెక్టరేట్లోని సేవా కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల పని దినాలలో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డేటా సవరణ కోసం వచ్చే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్.పీ.జీ కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్ తమ వెంట తీసుకురావాలని సూచించారు.కలెక్టర్ వెంట డి.పి.అర్.ఓ.వంగరి శ్రీధర్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube