జామ ఆకులను ఇలా తింటే అధిక బరువు తగ్గడంతో పాటు..?

ముఖ్యంగా చెప్పాలంటే ఏ సీజన్లోనైనా జామ పండ్లు( Guava fruits ) సులభంగా మార్కెట్ లో లభిస్తాయి.వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 If You Eat Guava Leaves Like This, You Will Lose Excess Weight , Health , Hralth-TeluguStop.com

అయితే జామ పండ్లే కాకుండా శరీరానికి జామ ఆకులు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఈ ఆకులలో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

అలాగే ప్రతి రోజు జామ ఆకులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అయితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Acidity, Pressure, Guava Fruits, Guava, Benefit, Tips-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల జీర్ణ క్రియ( Digestion ) మెరుగుపడుతుంది.ఇందులో ఉండే గుణాలు మల బద్ధకం, గ్యాస్, ఎసిడిటీ లాంటి పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.అంతే కాకుండా జామలో ఉండే గుణాలు పొట్టను క్లీన్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే ఖాళీ కడుపుతో జామ ఆకులతో( Guava leaves ) తయారు చేసిన టీ తాగడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.

అంతే కాకుండా ఇది అధిక బరువును నిరోధించడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుంది.

Telugu Acidity, Pressure, Guava Fruits, Guava, Benefit, Tips-Telugu Health Tips

కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు జామ ఆకుల టీని తీసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల అధిక బరువు( Overweight ) నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.అంత కాకుండా జామ ఆకులలో ఉండే ఫినాలిక్ మూలకాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను త్వరగా తగ్గిస్తాయి.అలాగే జామ ఆకులను రోజు ఖాళీ కడుపుతో తినడం వల్ల బిపి( Blood Pressure ) అదుపులో ఉంటుంది.

ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్, బీపీ నియంత్రించేందుకు ముఖ్యపాత్ర పోషిస్తాయి.అంతే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube