చేతులు వైట్ గా స్మూత్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి ఫేస్‌, బాడీ ఉన్నత తెల్లగా మరియు మృదువుగా చేతులు ఉండవు.ఎండల ప్రభావం, మృతకణాలు పేరుకుపోవడం, సరైన కేర్ తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల చేతులు నల్లగా అందవిహీనంగా మారుతుంటాయి.

 Try This Homemade Cream For White And Smooth Hands! White Hands, Smooth Hands, H-TeluguStop.com

అటువంటి చేతులను రిపేర్ చేసుకునేందుకు ఎక్కువ శాతం మంది మానిక్యూర్ ఎంపిక చేసుకుంటారు.కానీ కొందరికి మానిక్యూర్ చేయించుకునేంత సమయం లేదా స్తోమత ఉండకపోవచ్చు.

అయితే అలాంటి వారు చింతించాల్సిన అవసరం లేదు.

Telugu Tips, Cream, Homemade Cream, Latest, Skin Care, Skin Care Tips, Smooth, H

ఇంట్లోనే కొన్ని సింపుల్ చిట్కాలతో చేతులను వైట్ గా మరియు స్మూత్ గా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.క్రీమ్ త‌యారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ అనేది సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టార్ట్ చేసుకోవాలి.రోజూ ఉదయం మరియు నైట్ తయారు చేసుకున్న క్రీమ్ ను చేతులకు అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Cream, Homemade Cream, Latest, Skin Care, Skin Care Tips, Smooth, H

రోజుకు రెండుసార్లు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడటంతో పాటు వారానికి ఒకసారి చేతులు పై పేరుకుపోయిన మృత కణాలను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( coffee powder ) వన్ టేబుల్ స్పూన్ షుగర్, రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ షాంపూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా చేశారంటే మీ చేతులు తెల్లగా మారుతాయి.మృదువుగా మరియు కాంతివంతంగా మెరుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube