ఒకరకంగా చెప్పాలంటే వైసిపి( YCP ) క్యాడర్ ప్రస్తుతం పూర్తిగా నిరాశ, నిస్పృహాల్లో ఉంది.పార్టీకి ఎదురైన ఘోర ఓటమిని వారు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు.
కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని, 175 కు 175 గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసినా చివరకు 11 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితం అయింది.మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన నాయకులంతా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.
బయటికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఆర్థికంగానూ అనేకమంది నష్టపోయారు.
గత వైసిపి ప్రభుత్వం లో ఆర్థికంగా తమకు ఒరిగిందేమీ లేదని, ఇప్పటి నుంచే మళ్లీ యాక్టివ్ గా ఈ ఐదేళ్లపాటు ఉంటే మరింతగా ఆర్థికంగా నష్టపోతామని చాలామంది కీలక నేతలు సైలెంట్ అయిపోయారు.ఇతర నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా వెళ్ళిన వారు ఇప్పుడు తమ సొంత నియోజకవర్గాలకు మకాం మార్చేస్తున్నారు.
చాలామంది హైదరాబాద్ , బెంగళూరు వంటి నగరాలకు వ్యాపారాల నిమిత్తం వెళ్ళిపోతున్నారు.దీంతో ఈ ఐదేళ్లపాటు క్యాడర్ ను కాపాడుకుంటూ మళ్లీ నాయకుల్లో ఉత్సాహం పెంచడం జగన్ కు అతిపెద్ద సవాల్.175 నియోజకవర్గాలకు( 175 constituencies ) గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కేవలం 11 మంది మాత్రమే గెలుపొందడంతో మిగిలిన నియోజకవర్గాల్లో చాలావరకు కొత్త ఇన్చార్జిలను నియమించాల్సి ఉంటుంది .నియోజకవర్గాల మార్పు, సామాజిక వర్గ ప్రయోగాలు విఫలం కావడంతో , బలమైన సామాజిక వర్గాలు పట్టించుకోకుండా ఇతర నియోజకవర్గాల నుంచి నాయకులను తీసుకువచ్చి తమ నెత్తిన పెట్టారనే ఆగ్రహం, అసంతృప్తి స్థానిక నేతల్లో ఉంది అటువంటి చోట కచ్చితంగా ఇంచార్జిలను మార్చాల్సిన పరిస్థితి ఉంది.స్థానికలకు అవకాశం ఇస్తేనే మంచిదనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది.
ఈ ఐదేళ్ల పాటు టిడిపి( TDP ) కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కేడర్ ను సిద్ధం చేసే విధంగా జగన్ సైతం పూర్తిగా జనాల్లో తిరుగుతూ పార్టీ కేడర్ కు ధైర్యం చెబుతూనే, మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ నాయకులకు అన్ని విధాలుగా లబ్ధి చేస్తామని, గతంలో మాదిరిగా కాకుండా ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తామనే భరోసా జగన్ కల్పించగలిగితేనే వైసిపి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.