రోజుకు గంట ప్రిపరేషన్.. 34 లక్షల జీతంతో జాబ్.. యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి వేతనంతో ఉద్యోగం సాధిస్తే మాత్రమే కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదగడం సాధ్యమవుతుందనే సంగతి తెలిసిందే.రోజుకు గంట పాటు ప్రిపరేషన్ కొనసాగించి 34 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగంకు ఎంపికైన యాల్ల కృష్ణవేణి( Yalla Krishnaveni ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

 Techie Krishnaveni Inspirational Success Story Details Inside Goes Viral In Soci-TeluguStop.com

ఎలాంటి కోచింగ్ లేకుండా నాలుగేళ్ల పాటు కష్టపడిన కృష్ణవేణి ఉద్యోగం సాధించడం ద్వారా కన్నవాళ్ల కలలను నెరవేర్చారు. హుజూరాబాద్( Huzurabad ) కు చెందిన కృష్ణవేణి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

నేను పేదింటి ఆడబిడ్డనని అమ్మానాన్నల కష్టం చూస్తూ పెరిగానని ఆమె వెల్లడించారు.బీటెక్ పూర్తయ్యే సమయానికి మంచి ప్యాకేజ్ తో జాబ్ అందుకోవాలనేది నా లక్ష్యమని ఆమె అన్నారు.

Telugu Paypal Company, Techie-Inspirational Storys

ఈ సక్సెస్ సులువుగా దక్కలేదని కృష్ణవేణి వెల్లడించారు.నాన్న ప్రైవేట్ చిట్ ఫండ్ లో ఉద్యోగి అని చెల్లి మెడిసిన్ చదువుతోందని ఆమె అన్నారు.ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిని సైతం ఎదుర్కొన్నామని ఆమె చెప్పుకొచ్చారు. కోడింగ్ పై పట్టు పెంచుకోవడం ద్వారా కెరీర్ పరంగా విజేతగా నిలిచానని కృష్ణవేణి కామెంట్లు చేశారు.

ఫోన్, ల్యాప్ టాప్ లను నైపుణ్యాలను పెంచుకోవడానికి మాత్రమే వాడానని కృష్ణవేణి పేర్కొన్నారు.

Telugu Paypal Company, Techie-Inspirational Storys

క్యాంపస్ ఇంటర్వ్యూలో పే పాల్ కంపెనీలో( PayPal Company ) జాబ్ వచ్చిందని ఆమె తెలిపారు.ఇష్టమైన దాని కోసం కష్టపడితే కచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కృష్ణవేణి వెలడించారు.యాళ్ల కృష్ణవేణి సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

యాళ్ల కృష్ణవేణి కెరీర్ పరంగా తెలివిగా అడుగులు వేయడం ద్వారా ఈ స్థాయిలో సక్సెస్ సాధించారని చెప్పవచ్చు.యాళ్ల కృష్ణవేణి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube