అనవసరంగా సవాల్ చేశామా ? రుణమాఫీ పై బీఆర్ఎస్ టెన్షన్

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదనే ధీమాతో ఉంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ .ఆ ధీమాతోనే రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ ను,  సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే విధంగా బీఆర్ఎస్( BRS ) అనేక విమర్శలు చేసింది.

 Brs Tension Over Loan Waiver, Brs, Telangana Government, Telangana, Runamafi, Te-TeluguStop.com

ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు సైతం రేవంత్ రెడ్డికి ( Revanth Redd )రుణమాఫీపై రాజీనామా సవాల్ కూడా విసిరారు.  అయితే ఈ రుణమాఫీ అమలు చేయకపోతే ప్రజల్లోనూ చులకన అవుతామని,  రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కోవాలని.

Telugu Brs Loan Waiver, Hareesh Rao, Runamafi, Telangana, Telanganacm-Politics

బీఆర్ఎస్ కు ఇదే ప్రధాన అస్త్రంగా మారుతుందని ముందుగానే గ్రహించిన రేవంత్ రెడ్డి గడువు కంటే ముందుగానే రుణమాఫీని అమలు చేసి బీ ఆర్ ఎస్ ను ఇరుకును పడేశారు.దీంతో రుణమాఫీ విషయంలో తాము అనవసరంగా తొందర పడ్డామా , అనవసర సవాళ్లు విసిరి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి తప్పు చేశామా అన్న అభిప్రాయం బీఆర్ఎస్ లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.అసలు అమలు సాధ్యం కాదు అనుకున్న రుణమాఫీని రేవంత్ రెడ్డి అమలు చేయడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన మిగతా హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే .బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని ,  కాంగ్రెస్ పై విమర్శలు చేసేందుకు తమకు అస్త్రాలు కరువవుతాయని బిఆర్ఎస్ అధిష్టానం టెన్షన్ పడుతోంది.  లోక్ సభ ఎన్నికల సమయంలో రుణమాఫీ అంశాన్ని బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది.  దీనిపైన కాంగ్రెస్ ( Congress )ను ఇరుకున పెట్టే విధంగా సవాళ్లు విసిరింది .

Telugu Brs Loan Waiver, Hareesh Rao, Runamafi, Telangana, Telanganacm-Politics

ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే మా పదవులకు రాజీనామా చేస్తామని , లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎన్నికల సమయంలో బహిరంగంగా సవాళ్లు విసిరారు.దీనిపై రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు .తప్పకుండా రుణమాఫీ అమలు చేసి తీరుతామని బీఆర్ఎస్ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ప్రతి సవాల్ విసిరారు.పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే రుణమాఫీ అమలు పైనే రేవంత్ రెడ్డి కసరత్తు చేశారు .రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ పై పూర్తిగా ఫోకస్ చేశారు  జూలై 18న లక్ష లోపురుణాలను తొలి దశలో మాఫీ చేయడంతో బీఆర్ఎస్ ఇప్పుడు టెన్షన్ పడుతోంది.పదేపదే రుణమాఫీ పై తాము విమర్శలు చేయడంతోనే రేవంత్ రెడ్డి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేశారని ,  అనవసరంగా రేవంత్ కు క్రెడిట్ దక్కే విధంగా తామే చేశామనే అంతర్మాదనం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube