తెలుగు ఫ్యాన్స్, డబ్బు కావాలి.. కానీ మన భాషను అవమానిస్తున్న తమిళ్ హీరోలు

ప్రాంతాల మీద, భాషల మీద చాలా మందికి ప్రేమ ఉంటుంది.ఉండాలి కూడా.

 Tamil Heros Insulting Telugu Language , Telugu Language ,tamil Heros , Insultin-TeluguStop.com

కానీ.అతి ప్రేమ అనేది చాలా ప్రమాదకరం.

అలాంటి వారిలో తమిళులు కూడా ఉంటారు.వారికి భాష మీద ఉన్న ప్రేమ మరొకరికి ఉండదని చెప్పుకోవచ్చు.

వాళ్ల సినిమాలకు సంబంధించిన పేర్లన్నీ తమిళంలోనే ఉంటాయి.అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతూ వస్తున్నాయి.

అక్కడి సినిమాలకు కూడా ఇంగ్లీష్ పేర్లు పెడుతున్నారు.అయితే ఆయా సినిమాలను తెలుగులో రిలీజ్ చేసినప్పుడు పేరుని మాత్రం మార్చడం లేదు.

వలిమై, మహాన్‌, ఈటి సహా పలు సినిమాలు ఇలాంటి కోవలోకే వస్తాయి.

వాస్తవానికి తమిళ భాష పదాలకు తెలుగులో సరిపడే అర్థాలు వచ్చే పదాలు చాలా ఉన్నాయి.వలిమై అంటే బలం లేదా శక్తి అని.మహాన్‌ అంటే మహానుభావుడు లేదంటే గొప్పవాడు అని, ఈటి- ఎదర్కుం తునిందవన్ అంటే దేనికీ భయపడనివాడు అని తెలుగులో అర్థాలు ఉన్నాయి.కానీ తమిళ పేర్లతోనే తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు.గతంలోనూ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి.తమిళ సినిమాలకు ఇంగ్లీష్ పేరు పెడితే తెలుగులో సమస్య ఉండేది కాదు.అలాంటి సినిమాలు ఏంటని చూస్తే బీస్ట్‌, మాస్టర్‌, 24ను ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.

కానీ తమిళ సినిమాలకు తెలుగులో అర్థం వచ్చే పేర్లు ఉన్నా మార్చక పోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.తాజాగా వలిమై సినిమాకు సంబంధించి కార్తికేయ మాట్లాడాడు.

తమిళంలో ఉన్న పేరు తెలుగు వాళ్లకు అలవాటు అయిపోయిందని చెప్పాడు.ఇప్పుడు వేరే పేరు పెడితే డబ్బింగ్ సినిమా అనుకుంటారని చెప్పాడు.అందుకే తెలుగులో కూడా వలిమై అనే పేరునే పెట్టినట్లు వెల్లడించాడు.ఈ సినిమాలో కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.అటు మానాడు అనే సినిమాను తెలుగులోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు దానికి లూప్ అనే పేరు పెట్టారు.మానాడు అని రీలీజ్ చెయ్యెచ్చు కానీ.

అలా చేయలేదు.అయితే ఆ సినిమా తెలుగులోకి రిలీజ్ కాలేదు.

పేరు మార్చిన సినిమాలు చాలా ఉన్నాయి.కానీ.

ప్రస్తుతం తమిళ సినిమాలను అదే పేరుతో తెలుగులోకి రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది.అయితే తెలుగునాట సినిమాలు మంచి వసూళ్లు చేపట్టాలని కానీ.

పేరు మార్చడం చేతకాదా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు తెలుగు అభిమానులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube