అసలే తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో తడబడి ఇంటా బయటా విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా.రేపో మాపో అధ్యక్ష బరిలో నుంచి కూడా బైడెన్( Joe Biden ) తప్పుకుంటారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న అమెరికా అధ్యక్షుడు .మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు .అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం చెప్పలేక తడబడ్డారు.తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా – ఉక్రెయిన్ సమస్య గురించి ప్రస్తావించారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్( Iran ) అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.

ఆ తర్వాత చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా సెనేట్ మెజారిటీ నేత చక్ షుమెర్ అక్కడున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బైడెన్‌కి కూడా ఇచ్చి, పక్కకు జరిగారు.సరిగ్గా ఇదే సమయంలో బైడెన్ మతిమరుపు బయటపడింది.అప్పటికే తనకు షుమెర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మరిచిపోయిన పెద్దాయన.మరోసారి కరచాలనం కోసం చేయి ఇచ్చారు.అప్పట్లో ఈ ఘటన వైరల్ అయ్యింది.
ఇలా ఒకటి కాదు రెండు కాదు.బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు.

తాజాగా ఈసారి అంతకుమించిన వివాదంలో ఇరుక్కున్నారు బైడెన్.ఏకంగా ఒక మహిళను ముద్దు పెట్టుకోబోయారు.భార్య జిల్ బైడెన్( Jill Biden ) దీనిని గుర్తించి పరుగు పరుగున రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో బైడెన్ పరువు గంగలో కలిసిపోయేది.అసలేం జరిగిందంటే.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.ఓ మహిళతో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఆమెకు అతి సన్నిహితంగా వెళ్లి, దాదాపు ముద్దు పెట్టుకునే స్థితిలో కనిపించారు.
అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడి సతీమణి , అమెరికా ప్రథమ మహిళ )బైడెన్ దానిని గమనించి వెంటనే భర్తను అప్రమత్తం చేశారు.జరిగినది ఆయనకు చెప్పగా.
బైడెన్ సైతం అవాక్కయ్యారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social mediaలో వైరల్ అవుతోంది.
అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.అధ్యక్ష ఎన్నికల్లో తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిడి వస్తున్న వేళ.ఈ వీడియో ఆయనను మరిన్ని చిక్కుల్లో నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.