రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే వెయిట్ లాస్‌తో పాటు మ‌రెన్నో లాభాలు!

సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.ఆరోగ్యం, ఫిట్ నెస్ పై శ్రద్ధ వహించే వారు మాత్రం టీ కాఫీలకు బదులుగా హాట్ వాటర్ లేదా లెమన్ వాటర్ వంటివి తీసుకుంటారు.

 If You Taking This Drink In The Morning There Are Many Benefits Besides Weight L-TeluguStop.com

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను గనుక రోజు మార్నింగ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య లాభాలను సైతం తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు రెండు గిన్నెలు తీసుకుని ఒకదాంట్లో ఐదు బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరో గిన్నెలో చిటికెడు కుంకుమ పువ్వు మరియు కొద్దిగా వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, హాఫ్‌ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్‌ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకుని ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం అందులో నాన‌బెట్టుకున్న కుంకుమ పువ్వును వాటర్ తో సహా వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Almonds, Cardamom, Cinnamon, Ginger, Tips, Healthy, Latest, Saffron-Telug

ఈలోపు బాదంపప్పుల‌కు ఉన్న పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆపై మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.

ఈ డ్రింక్ ను ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు.

హార్మోన్ అసమతుల్యత దూరం అవుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

నీరసం, అలసట, ఒత్తిడి, మార్నింగ్ సిక్ నెస్ వంటివి క్షణాల్లో మాయం అవుతాయి.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.మరియు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోయి బాడీ డీటాక్స్ సైతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube